
రామాయణం ప్రకారం సాధారణంగా శ్రీరాముడి వనవాస మార్గాన్ని అయోధ్య నుంచి శ్రీలంక వరకు సీతామాత, లక్ష్మణుడితో కలిసి శ్రీరాముడు నడిచిన మార్గాన్ని శ్రీరాముడి వనవాస మార్గంగా భావిస్తారు. కానీ యూపీలో అయోధ్య నుంచి ప్రయాగరాజ్ లోని శ్రీవెంగపూర్ మీదుగా చిత్ర కూట్ వరకు శ్రీరాముడు నడిచాడని విశ్వసిస్తారు.
ఈ మార్గంలో వెళ్తున్న సమయంలోనే శ్రీరాముడి జీవితంలో ఎన్నో ముఖ్యమైన ఘటనలు చోటు చేసుకున్నాయని విశ్వసిస్తారు. అందువల్ల ఆ మార్గంలో వందే భారత్ రైలును ప్రారంభించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. 2023 చివరి నాటికి వాటి సంఖ్యను 75 కి పెంచుతామని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు.
ఈ ప్రతిపాదిత వందే భారత్ రైళ్ల మార్గాలను రైల్వే శాఖ పరిశీలిస్తోందని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాగరాజ్ – లక్నో – గోరఖ్ పూర్ మార్గంలో కూడా ఒక వందే భారత్ ను ప్రారంభించాన్న ప్రతిపాదన రైల్వే శాఖ వద్ద ఉంది.
More Stories
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి
జార్ఖండ్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం
బీహార్ లో తొలగించిన 3.66 లక్షల ఓట్ల వివరాలు వెల్లడించండి