
ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. రైలులోని ఓ కోచ్ లో పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోదీ సంభాషించారు. ఈ వందే భారత్ రైలు తిరువనంతపురం నుంచి కాసరగోడ్ వరకు ప్రయాణించనుంది.
ఈ రైలు కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్ 11 జిల్లాలను కవర్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరయ్ విజయన్, రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్, స్థానిక పార్లమెంటు సభ్యుడు శశి థరూర్, పాల్గొన్నారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది దేశీయంగా తయారు చేయబడిన సెమీ-హై-స్పీడ్ రైలు. ఈ రైలు అత్యాధునికమైన ప్రయాణీకుల సౌకర్యాలను అందిస్తోంది. ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. తిరువనంతరపురంలో డిజిటల్ సైన్స్ పార్కుకు శంకుస్థాపన చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అలాగే, రూ.3,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కూడా మంళవారం అంకురార్పణ చేశారు.
అంతకు ముందు దేశంలోనే తొలి వాటర్ మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్‌ను రూ. 1,137 కోట్ల ఖర్చుతో రూపొందించింది కేరళ ప్రభుత్వం. వాటర్ మెట్రోలో ఛార్జీలు కూడా తక్కువగానే ఉంటాయి. కనిష్ఠ టికెట్ ధర రూ. 20గా ఉండగా.. గరిష్ఠంగా రూ. 40గా ఉండటం విశేషం. మోదీ కేరళ పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోదీపై ఎప్పుడూ విమర్శలు చేసే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. మోదీ కూడా ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు.
మోదీతో ఉన్ని ముకుందన్ భేటీ
కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కలిశారు. పీఎంతో ప్రత్యేకంగా భేటీ అయిన ప్రధాని మోదీని కలిసిన విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. “థ్యాంక్యూ సార్….14 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలిశాను. చిన్నప్పుడు మిమ్మల్ని కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకూ నేను కోలుకోలేదు. మీ “కెమ్ చో భైలా” మాట నన్ను కదిలించింది. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడుకలుస్తానా ….గుజరాతీలో మీతో ఎప్పుడు మాట్లాడుతానా అని ఎదురుచూస్తూ వచ్చాను. ఇన్నాళ్ళకు నాకల నిజమైయ్యింది” అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
More Stories
ఉగ్రవాదం ఆపకపోతే ప్రపంచపటంలో పాక్ ఉండదు!
పీఓకేలో హక్కుల ఉల్లంఘనలకు పాక్ సమాధానం చెప్పాలి
యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్‌ను చూసి నేర్చుకోవాలి