
ఇక 2022-23లో ప్రయాణికుల ద్వారా రూ.63,300 కోట్ల ఆదాయాన్ని రైల్వే శాఖ ఆర్జించింది. 2021-22తో పోలిస్తే ఇది 61 శాతం అధికంగా ఉంది. వృద్ధిలో ఇది ఆల్‌టైమ్ రికార్డుగా ఉంది. కరోనా ప్రభావం కారణంగా 2021-22లో రైల్వేలు ప్రభావితమయ్యాయి. అయితే 2022-23లో పరిస్థితులు సద్దుమణగటంతో ఆదాయం గణనీయంగా పెరిగింది.
కరోనా పరిస్థితుల నుంచి కోలుకున్న భారతీయ రైల్వేలు మూడు సంవత్సరాల తర్వాత పూర్తిస్థాయి ఆదాయాన్ని సాధించింది. ఖర్చులకు తగ్గట్టు ఆదాయాన్ని గడించింది. ఆపరేటింగ్ రేషియోను 98.14 శాతం సాధించేందుకు ఖర్చులను కఠినంగా నిర్వహించడం కూడా ఓ కారణంగా ఉంది.
మొత్తంగా భారతీయ రైల్వే 2022-23లో లక్ష్యంగా పెట్టుకున్న ఆదాయాన్ని సాధించింది. ఇక, అంతర్గత వనరుల నుంచి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ల కోసం రూ.3,200 కోట్లను రైల్వేస్ జనరేట్ చేసింది. 2022-23లో రైల్వేల స్థూల ఆదాయం రూ.2,39,803 కోట్లుగా ఉంది. 2021-22లో ఇది రూ.1,91,278 లక్షలుగా ఉంది.
ట్రాఫిక్ రెవెన్యూ విషయానికి వస్తే, 2022-23లో ప్యాసెంజర్ రెవెన్యూ రూ.63,000కోట్లుగా ఉంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.39,214 కోట్లుగా నమోదైంది. 2022-23లో ఇతర కోచ్‌లకు సంబంధించిన వాటి ద్వారా రూ.5,951 కోట్ల ఆదాయం రైల్వేలకు సమకూరింది. 2021-22లో ఇది రూ.4,899గా నమోదైంది. దీంతో 21 శాతం వృద్ధి కనిపించింది.
2022-23లో రైల్వేలకు ఖర్చు మొత్తంగా రూ.2,37,375 కోట్లుగా ఉంది. దీంతో ఆదాయం, ఖర్చుల ఆపరేటింగ్ రేషియో 98.14 శాతంగా నమోదైంది. 2020 నుంచి కరోనా కారణంగా భారతీయ రైల్వేలకు ఆదాయం భారీగా తగ్గింది. అన్ని రకాల రెవెన్యూపై ప్రభావం పడింది. అయితే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వే పూర్తిగా కోలుకున్నట్టు గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లను భారతీయ రైల్వేస్ వరుసగా తీసుకొస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలో మరిన్ని పరుగులు పెట్టనున్నాయి.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు