2047@ అభివ్రుద్ధి చెందిన దేశంగా భారత్

2047@ అభివ్రుద్ధి చెందిన దేశంగా భారత్
 
‘‘గత 75 ఏళ్లుగా చూస్తున్నాం. ఎఫ్పుడు చూసినా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమనే చెబుతున్నం. కానీ మోదీగారు చరిత్రను తిరగరాయబోతున్నరు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. భారత్ ను విశ్వగురు స్థానంలో పెట్టడమే మోదీ స్వప్నం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు.
 
అందులో భాగంగా దేశ అభివ్రుద్దిలో అత్యంత కీలకమైన యువతలోని నేపుణ్యాన్ని వెలికితీసేందుకు పంచ్ ప్రాణ్ పేరుతో ఐదు ముఖ్యాంశాలతో ‘‘యువ ఉత్సవ్’’ నిర్వహించడం గొప్ప విషయమని చెప్పారు.  కరీంనగర్ లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొంటూ మన దేశం ప్రపంచంలోనే ఆర్దికంగా 5 స్థానంలో ఉన్నం… మరో మూడేళ్లలో 3వ స్థానానికి చేరబోతున్నామని వెల్లడించారు.
 
కరోనా వచ్చినప్పుడు జాతి ఐక్యత ఏందో ప్రపంచానికి చూపించామని,  కరోనా వ్యాక్సిన్ కనుగొని 150 దేశాలకు సరఫరా చేసి ప్రాణాలను కాపాడుకున్నామని పేర్కొంటూ ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి తీసుకొచ్చామని గుర్తు చేశారు.
 
 ప్రతి ఒక్కరిలో దేశంపట్ల బాధ్యతను గుర్తు చేయాలని సూచించారు. దేశం నాకేం ఇచ్చిందనే దానికంటే నేను దేశానికి ఏం చేస్తున్నానని ఆలోచించాలని పేర్కొన్నారు. మమ్మీ-డాడీ, ఆంటీ-అంకుల్ సంస్క్రుతి మనది కాదని పేర్కొంటూ దేశ వారసత్వ సంస్క్రుతిని, సాంప్రదాయాలను కాపాడుకోవాలని యువతకు సూచించారు.
 
చరిత్ర తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవాల్సిందే
 
తెలంగాణ, భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవాలంటే పుస్తక పఠనం చాలా ముఖ్యమని సంజయ్ చెప్పారు. కరీంనగర్ పట్టణంలోని సర్కస్ గ్రౌండ్ లో నిర్వహించిన “కరీంనగర్ పుస్తక మహోత్సవం” ను సందర్శిస్తూ మొబైల్ టెక్నాలజీని వినియోగిస్తున్న ఈ రోజులలోనూ పుస్తకం చదివితేనే తృప్తి కలుగుతుందని తెలిపారు.
 
పుస్తకంతో జ్ఞానాన్ని తెలుసుకోవడంతో పాటు ఆ జ్ఞానాన్ని పది మందికి పంచితేనే సమాజానికి మేలు జరుగుతోందని స్పష్టం చేశారు. చినిగిన, పాత బట్టనైనా వేసుకో… కొత్త పుస్తకాన్ని కొనుక్కో అనే సామెత పుస్తకం ప్రాముఖ్యతను తెలుపుతుందని పేర్కొన్నారు.