
భారతదేశం అత్యంత వేగవంతంగా అభ్యున్నతి చెందుతున్న దేశమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా. తమిళి సై సౌందర రాజన్ తెలిపారు. స్వయంశక్తితో ఎదుగుతున్న దేశంగా వెల్లడించారు. 20 దేశాలకు ఆధిపత్యం వహిస్తున్న సందర్భంలో భారతీయులమైన మనం అపారమైన గర్వం పొందుతున్నామని పేర్కొన్నారు. తన కలను సాకారం చేసుకొనే దిశగా పయనించిందని ఆమె చెప్పారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన “భారత్ కు జి 20 అధ్యక్ష పదవి : భారత్ ప్రపంచ నాయకత్వం కావడానికి అవకాశాలు, సవాళ్లు” అంశంపై వే, అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సదస్సును జ్యోతి ప్రజ్జ్వలన చేసి ప్రారంభిస్తూ ఇది వరకు భారతదేశం ప్రపంచ దేశాల నుంచి అన్ని వస్తువులను దిగుమతి చేసుకొనేదని, కాని ఇప్పుడు ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని పేర్కొన్నారు.
85% అంతర్జాతీయ స్టార్టప్ కంపెనీలు మన దేశ సహకారం కోసం ఎదురుచూస్తున్నాయని ఆమె చెప్పారు. కరోనా మహమ్మారిని తట్టుకొని వాక్సినేషన్ ను తయారుచేసి దాదాపు 150 దేశాలకు సరఫరా చేసిన ఘనత మన దేశానికి ఉందని తెలిపారు. ఇదేగాక రుబెల్లా, పోలియో వ్యాధులకు వ్యాక్సిన్ తయారు చేసి అతి ప్రాణాంతకమైన వ్యాధులకు చికిత్సను అందిస్తుందని వివరించారు.
ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు వంటి అనే నినాదంతో భారతదేశం సర్వ స్వతంత్ర దేశంగా ఎదుగుతుందని గవర్నర్ తెలిపారు. పెద్దవాళ్లను గౌరవించడం, వర్తమాన కాలంలో పరిస్థితుల కు అనుగుణంగా అవసరాలను తీర్చడం, భవిష్యత్ తరాలకు బంగారు బాటను అందించడం కోసం ప్రయత్నం చేయడం భారతదేశం మీద ఉన్న ఒక బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.
భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ప్రపంచ దేశాలకు శాంతి, అహింస మార్గాలను చూపిందన్నాని ఆమె గుర్తు చేశారు. భారతీయ ధార్మిక, ఆధ్యాత్మిక, తాత్త్విక, భక్తి సాక్షాత్కారం యోగా వల్ల కలుగుతుం దని ఆమె పేర్కొన్నారు. భారతదేశం చూపిన యోగా ధ్యాన విద్య అంతర్జాతీయ పరంగా మంచి మార్గాన్ని నిర్దేశించిందని చెప్పారు.
ఈ 2023 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని “ఇంటర్నేషనల్ డే ఆఫ్ మిల్లెట్స్” అనే సంక్షిప్త సందేశంతో ముందుకు వెళ్తుందని డా. తమిళసై తెలిపారు. భవిష్యత్తు తరాలకు పరిసరాల పరిశుభ్రతతో పాటుగా, పచ్చదనం అలవాటు చేసుకొనే విధంగా శిక్షణ ఇవ్వా లని ఆమె సూచించారు. విద్యార్థులు వ్యక్తిగత స్వయం సమృద్ధిని సాధించే దిశగా పయనించాలని చెప్పారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత