2019 నుంచి పనిచేస్తున్న ఆరు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు

2019 నుంచి పనిచేస్తున్న ఆరు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు
దేశంలో 2019 నుంచి ఇంతవరకు  ఆరు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు అయ్యాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వీకే సింగ్ (రిటైర్డ్) లోక్ సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా  ఇచ్చిన  సమాధానంలో తెలిపారు. వీటిలో కలబురగి (ప్రాజెక్టు వ్యయం రూ.175.57 కోట్లు), ఓర్వకల్ (కర్నూలు) (ప్రాజెక్టు వ్యయం రూ.187 కోట్లు), సింధుదుర్గ్ (ప్రాజెక్టు వ్యయం రూ.520 కోట్లు), ఇటానగర్ (ప్రాజెక్టు వ్యయం రూ.646 కోట్లు), కుషినగర్ (ప్రాజెక్టు వ్యయం రూ.448 కోట్లు), మోపా (ప్రాజెక్టు వ్యయం రూ.2870 కోట్లు) వంటి 6 గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు ఉన్నాయి.

జిఎఫ్ఎ పాలసీ 2008 ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రం డాబ్రా (గ్వాలియర్) వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి ఎంఓసిఎ ‘సూత్రప్రాయ’ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని సింగ్రౌలి లో కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి ఎంఓసీఏ మొదటి దశ క్లియరెన్స్ అంటే సైట్ క్లియరెన్స్ మంజూరు చేసింది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, రేవా, జబల్ పూర్ విమానాశ్రయాల విస్తరణ కార్యక్రమాలను ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టింది.
 
విమాకాగా, నయాన రంగంపై నియంత్రణ తొలగించిన తర్వాత మార్కెట్ ఆధారితంగా విమాన ఛార్జీలు ఉంటాయని, విమాన ఛార్జీలను ప్రభుత్వం నిర్ణయించదని మంత్రి తెలిపారు.
 
మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా  విమాన టికెట్ ధరలు సాధారణంగా మారుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా డైనమిక్ ఛార్జీల విధానం వల్ల ప్రయాణ తేదీకి సమీపంలో కొనుగోలు చేసిన టికెట్ల ధర కంటే ముందుగా కొనుగోలు చేసిన టిక్కెట్లు ధర తక్కువగా ఉంటుందని చెప్పారు.
 
నిర్వహణ వ్యయం, సేవల లక్షణాలు, సహేతుకమైన లాభం, సాధారణంగా అమల్లో ఉన్న టారిఫ్ తో సహా అన్ని సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్, 1937లోని రూల్ 135  సబ్-రూల్ (1) నిబంధనల ప్రకారం విమానయాన సంస్థలు సహేతుకమైన టారిఫ్ నిర్ణయించవచ్చు.
 
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) పరిధిలో టారిఫ్ మానిటరింగ్ యూనిట్ పనిచేస్తుంది. ఇది నెలవారీ ప్రాతిపదికన కొన్ని మార్గాల్లో విమాన ఛార్జీలను పర్యవేక్షిస్తుంది. విమానయాన సంస్థలు వారు ప్రకటించిన పరిధికి మించి విమాన ఛార్జీలు వసూలు చేయకుండా చర్యలు అమలు చేస్తుందని డా. సింగ్ వివరించారు.