
టర్కీలో ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. వరుసగా మూడు భారీ భూకంపాలతో ఆ దేశం అతలాకుతలమైనట్లు అధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డగోన్ తెలిపారు. టర్కీలో సుమారు 185 సార్లు భూ ప్రకంపనలు నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఖరమన్‌మారస్ కేంద్రంగా భూమి కంపించిన విషయం తెలిసిందే. రెండో కంపం 7.7 తీవ్రతతో, మూడవది 7.6 తీవ్రతతో సంభవించినట్లు అధికారులు తెలిపారు.
టర్కీలో వచ్చిన భూకంపం వల్ల గ్రీన్‌ల్యాండ్‌లో కూడా ప్రకంపనలు నమోదు అయినట్లు డెన్మార్క్ జియోలాజికల్ సర్వే పేర్కొన్నది. 1999లో వచ్చిన 7.4 తీవ్రత భూకంపం తర్వాత ఇదే పెద్ద కంపమని ఇస్తాంబుల్ అధికారులు వెల్లడించారు. ఆ ఏడాది వచ్చిన భూకంపంలో 17వేల మంది మరణించారు.
ప్రస్తుతం దక్షిణ టర్కీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోపక్క శీతాకాలం, పైగా మంచు విపరీతంగా కురుస్తుండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. భూకంపం కారణంగా ఈ ప్రాంతంలోని మూడు విమానాశ్రయాలు పనికిరాకుండా పోయాయని, దాంతో కీలకమైన సహాయ పంపిణీ ఇబ్బందవుతోందని అధికారులు తెలిపారు.
భారత్, అమెరికా, యురోపియన్ యూనియన్, రష్యా, ఫ్రాన్స్, స్వీడన్ సహా పలు దేశాలు ఇప్పటికే తమ వంతు సాయానిు అందిస్తునుట్లు తెలిపాయి. టర్కీకి చేయగలిగిన సాయమంతా చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక