రామమందిర్ ట్రస్ట్‌కు రు రూ. 1800 కోట్ల పన్ను మినహాయింపు

రామమందిర్ ట్రస్ట్‌కు రు రూ. 1800 కోట్ల పన్ను మినహాయింపు

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో శరవేగంగా జరుగుతున్న రామమందిర  నిర్మాణపనులు జరుగుతూ, వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రజల దర్శనంకు వీలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తుండగా,  తాజాగా ఆదాయపన్ను విషయమై ట్రస్టుకు భారీ ఉపశమనం కలిగింది.

ఈ ఆలయ నిర్మాణానికి దేశం, ప్రపంచం నుండి వచ్చే విరాళం మొత్తంపై పన్నుకు సంబంధించి  కోట్లాది మంది రామభక్తుల విరాళాలపై కోర్టు కోట్లాది రూపాయల పన్నును మాఫీ చేసింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్  ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ  ట్రస్ట్‌కు సుమారు రూ. 1800 కోట్ల పన్ను మినహాయింపు లభించిందని తెలిపారు.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ ప్రతిష్ఠాపన కోసం నిధి సమర్పణ ప్రచారాన్ని ప్రారంభించిందని రాయ్ చెప్పారు. గత ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రచారంలో దాదాపు రూ. 5,500 కోట్లు వచ్చాయి. దీంతో ట్రస్టుపై ఆదాయపన్ను శాఖ దాదాపు రూ.1800 కోట్ల పన్ను విధించగా, ఇప్పుడు వసూలు చేయడం లేదు.

ఇటీవల జరిగిన ట్రస్టు సభ్యుల సమావేశంలో రాయ్ ఈ పన్ను గురించి తెలియజేశారు. 2020,  2021 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ట్రస్ట్ దాఖలు చేసిన ఆదాయపా పన్ను రిటర్న్ యథాతథంగా ఆమోదించడంతో పన్ను విధించే ప్రసక్తి లేదు. ట్రస్ట్ క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జ్ ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, అసెస్‌మెంట్ అథారిటీ సంతృప్తి చెందనప్పుడు అది పన్ను విధిస్తుందని, దీనిపై కోర్టులో అప్పీలుకు వెళ్లినప్పుడు, పన్ను ఉపసంహరిస్తారని తెలిపారు. ప్రభుత్వం 80జి కింద దాతకి యాభై శాతం పన్ను మినహాయింపు ఇచ్చిందని చెప్పారు.

వాస్తవానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80జి ప్రకారం, దాత దాతృత్వం లేదా విరాళం అందించిన సహాయంపై పన్ను మినహాయింపు పొందుతారు. ట్రస్ట్‌పై పన్ను విధించడం వల్ల ప్రయోజనం లేదని, అయితే దేశం మొత్తం మీద నిధి సమర్పణ్ అభియాన్ జరుగుతోందని వివరించారు. అందుకే ఆ సమయంలో అసెస్‌మెంట్ అథారిటీ అవిశ్వాసం పెట్టి పన్ను విధించిందని గుప్తా చెప్పారు. తమ ఖాతాను టిసిఎస్ నిర్వహిస్తుండగా. ఢిల్లీకి చెందిన ప్రముఖ సంస్థ ఆడిట్‌ను నిర్వహిస్తుందని తెలిపారు.