సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం మూడు రోజుల్లో 44 మంది జడ్జీల పేర్లను ప్రకటించనున్నట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. న్యాయమూర్తుల నియామకంలో జాప్యంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా . పెండింగ్లో ఉన్న పేర్లను వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైకోర్టుల కొలీజియం సిఫారసు చేసి, ప్రభుత్వం వద్ద పెండింగ్లోనున్న 104 మంది జడ్జీల పేర్లనుండి 44 మందిని ఎంపిక చేసి ఈ వారాంతంలో సుప్రీంకోర్టుకు పంపే అవకాశం ఉందని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి కోర్టుకు తెలిపారు.
అయితే కొలీజియం సిఫారసు చేసిన జాబితాలో ఐదు పేర్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని వెంకటరమణి జస్టిస్ ఎస్.కె.కౌల్, ఎ.ఎస్.ఓకాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసు విచారణను కోర్టు వచ్చేనెల 3వ తేదీకి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు పదోన్నతి కోసం జస్టిస్ పంకజ్ మిథాల్, సంజరు కరోల్, రాజస్థాన్, పాట్నా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో సహా ఐదుగురు పేర్లను డిసెంబర్ నెలలో సిజెఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

More Stories
ఢిల్లీలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్ .. భారీ ఉగ్రకుట్ర భగ్నం
పంజాబ్ ప్రభుత్వ పాఠశాల గోడపై ఖలిస్థాన్ నినాదాలు
సంతాప తీర్మానంలో విమర్శలపై బిజెపి అభ్యంతరం