
క్రెడిట్ కార్డు, ఎన్‌పీఎస్, భీమాలలో జనవరి 1 నుండి కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో జీవిత భీమా, ఆరోగ్య భీమా, వాహనాల భీమా అంటూ ఇలా చాలా రకాల ఇన్సూరెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు కూడా తమ అవసరాన్ని బట్టి భీమాపాలసీలను తీసుకుంటున్నారు.
అయితే.. జనవరి 1 నుంచి ఏరకమైన భీమా తీసుకున్నా సరే.. కేవైసీ డాక్యుమెంట్లను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కొద్ది రోజుల క్రితమే ఇందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. జనవరి 1 నుంచి కొత్తగా ఇన్సూరెన్సులు తీసుకునే వారి వద్ద నుంచి కేవైసీ డాక్యుమెంట్లను తీసుకోవాల్సిందిగా ఇన్సూరెన్స్ కంపెనీలకు సూచించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు.. ఇకపై సెల్ఫ్ డిక్లరేషన్లు సమర్పించి తమ ఎన్‌పీఎస్ అకౌంట్ల నుంచి ఆన్‌లైన్ ద్వారా పాక్షిక మొత్తాలను విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఇక ఉండదు. కొవిడ్ దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఉపసంహరించుకుంటున్నట్టు డిసెంబర్ 23న ప్రకటన విడుదల చేసింది.
ఈ నిర్ణయం జనవరి 1, 2023 నుంచి అమలులోకి రానుందని అందులో స్పష్టం చేసింది. అయితే.. సదరు ఉద్యోగులు తమ నోడల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా పాక్షిక మొత్తాలను విత్‌డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రైవేటు రంగానికి చెందిన ఉద్యోగులు మాత్రం ఆన్‌లైన్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని వివరించింది.
కాగా, ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డులను ఆన్‌లైన్ షాపింగ్ చేయడం ద్వారా పొందే రివార్డు పాయింట్లలో కోత విధించేందుకు చర్యలు తీసుకుంది. మొన్నటి వరకు ఎస్బీఐ కార్డును ఉపయోగించి అమెజాన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే.. కస్టమర్లకు 10X రివార్డు పాయింట్లు వచ్చేవి. కానీ జనవరి 1 నుంచి కేవలం 5X రివార్డు పాయింట్లు మాత్రమే రానున్నాయి.
అయితే.. బుక్‌మైషో, క్లియర్‌ట్రిప్, లెన్స్‌కార్ట్, నెట్‌మెడ్స్ తదితర వెబ్‌సైట్‌లలో క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే ఎప్పటిలాగే 10X రివార్డు పాయింట్లను అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. క్రెడిట్ కార్డు వినియోగదారులకు సంబంధించి.. రివార్డు పాయింట్ల కేటాయింపు, రీడీమ్ చేసుకునే విషయాల్లో పరిమితులు విధించింది.
More Stories
అమెరికాతో సుంకాల సమస్య పరిష్కారం కావాల్సి ఉంది
లక్షా 25 వేల డాలర్ల మార్క్ దాటిన బిట్‌కాయిన్
ఎవరూ క్లెయిమ్ చేయని రూ.1.84 లక్షల కోట్లు