
మనీలాండరింగ్ కేసులో నోటీసులు అందుకున్న తాండూరు ఎంఎల్‌ఎ పైలెట్ రోహిత్ రెడ్డి ఇడి విచారణ సోమవారం ముగియగా, తిరిగి రెండో రోజు కూడా మంగళవారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని ఇడి కార్యాలయానికి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రోహిత్‌రెడ్డి చేరుకోగా దాదాపు 6 గంటలుగా అధికారులు ఆయననను ప్రశ్నించారు. అనంతరం మంగళవారం మరోసారి విచారణకు రావాలని సూచించారు.
మరోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనను ఏ కేసులో పిలుస్తున్నారో తెలియదని రోహిత్ రెడ్డి చెబుతున్నారు. తన వ్యక్తిగత వివరాలతో పాటు తన కుటుంబ సభ్యుల బయోడేటా మాత్రమే అడిగారని తెలిపారు. బ్యాంక్ స్టేట్మెంట్స్, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పత్రాలు మరోసారి తీసుకురావాలని రోహిత్ రెడ్డిని అధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది.
అధికారులురులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారన తెలిపారు. ఇలా ఉండగా, సోమవారం పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు వచ్చే ముందు పెద్ద హైడ్రామా నడిచింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాలని ముందుగా ఈడీ ఆయనకు సమన్లు పంపింది. అందులో పేర్కొన్న విధంగా రోహిత్.. ఈడీ ఆఫీస్‌కు వెళ్లలేదు.
ఆయన ఉదయం 10 గంటలకు మణికొండలోని తన ఇంటి నుంచి బయలుదేరి నేరుగా సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లారు. ప్రగతి భవన్‌లో సుమారు రెండు గంటల పాటు సీఎంతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే విచారణకు హాజరుకాలేనని తన పర్సనల్ అసిస్టెంట్‌తో ఈడీకి లెటర్ పంపించారు.
వ్యక్తిగత కారణాలు, అయ్యప్ప మాలలో ఉన్నందున ఈ నెల 25 తర్వాత విచారణకు వస్తానని తెలిపినట్లు సమాచారం. అయితే ఆయన పంపిన రిక్వెస్ట్ లెటర్‌ను ఈడీ అధికాలు తిరస్కరిస్తూ, షెడ్యూల్ ప్రకారం రావాల్సిందేనని ఆదేశించడంతో విచారణకు ఎమ్మెల్యే హాజరయ్యారు.
విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేనని, కొంత సమయం ఇవ్వాలని ఈడీ అధికారులను కోరానని తెలిపారు. సమయం ఇవ్వకపోవడంతో విచారణకు వచ్చానని చెప్పారు. ఈడీ అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు.ఆడిటర్, అడ్వొకేట్ లేకుండానే ఈడీ అధికారుల ముందు హాజయ్యారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
అభ్యర్థుల ఎంపికకై ముగ్గురు సభ్యులతో బిజెపి కమిటీలు
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపు