
టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ ను రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేశారు. ఇప్పటకే మైనింగ్ వ్యవహారంలో ఈడీ దాడులను ఎదుర్కొంటున్న మంత్రి మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నుంచి నోటీసులు అందడం చర్చ గా మారింది. కమలాకర్ తో పాటు ఎంపీ గాయత్రి రవికి కూడా నోటీసులు అందాయి.
గతంలో విశాఖకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నకిలీ సీబీఐ పేరుతో అక్రమాలకు పాల్పడ్డాడు. తాను సీబీఐ అధికారిని అంటూ చలామణి అయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీబీఐ ఇటీవల కాపు సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్ తో దిగిన ఫోటోలను అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో మంత్రి గంగుల ను సాక్షిగా విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. మంత్రి గంగులకు , శ్రీనివాస్ కు మధ్య సంబంధాలపై అధికారులు విచారించనున్నట్టు తెలుస్తుంది. సీబీఐ నోటీసుల ఫై గంగుల స్పందించారు. తన ఇంటికి సిబిఐ అధికారులు రావడం నిజమే పేర్కొన్నారు.
“నాలుగు రోజుల క్రితం శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ ఆఫీసర్ అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత నాతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ విషయం తెలుసుకున్న సిబిఐ అధికారులు ఆ కేసులో నన్ను సాక్షిగా పరిగణించి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. నేను రేపు ఢిల్లీకి వెళతాను. జరిగింది ఏంటో సీబీఐ వివరిస్తాను” అని మంత్రి తెలిపారు.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం