
ప్రజలు ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కోవిడ్ చికిత్సను నమ్మకంగా తీసుకోవచ్చని, అక్కడ వైద్యులు,ఇతర సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని గవర్నర్ చెప్పారు.
ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తమ వద్దకు వస్తున్న కోవిడ్ పేషెంట్లకు తక్కువ ఖర్చుతో మానవతా దృక్పధంతో సేవలు అందించాలని కోరారు. రోగులను, వారి కుటుంబ సభ్యులను మరింత కుంగదీయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
గవర్నర్ తమిళిసై అభినందనలు అందుకున్న వారిలో ప్లాస్మా దాతల్లో రాంతేజ గంపాల, నాలుగుసార్లుప్లాస్మాదానం చేసిన ఐఐటి, గ్రాడ్యుయేట్ నితిన్‌కుమార్, రాష్ట్రంలో మొదటి ప్లాస్మాదాత ఎన్నంశెట్టి అఖిల్‌తో పాటు సురం శివ ప్రసాద్, సయ్యద్ ముస్తాఫా ఇర్ఫాన్, రామకృష్ణగౌడ్, శివానంద్, డా.సాయిసోమసుందర్, డా. రూప దర్శిని తదితరులు ఉన్నారు.
More Stories
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
తెలంగాణ రాజకీయాల్లో శూన్యత .. భర్తీకి బిజెపి సిద్ధం
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సత్తాతో సహా 25 పార్టీలపై వేటు