జియో నుంచి 5జీ వై-ఫై సర్వీసులు ప్రారంభం

జియో నుంచి 5జీ వై-ఫై సర్వీసులు ప్రారంభం
 ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సేవలను మరింతగా విస్తరించింది.  అందరికీ 5జీని అందుబాటులోకి తీసుకురావలని లక్ష్యంగా పెట్టుకున్న జియో తాజాగా ఈ రోజు జియో ట్రూ 5జీ ఆధారిత వై-ఫై సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. 
 
విద్యాసంస్థలు, మతపరమైన ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, వాణిజ్య ప్రదేశాలలో తొలుత 5జీ వై-ఫై సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు పేర్కొంది. జియో ట్రూ 5జీ సర్వీసులకు ఇది అదనమని తెలిపింది.   రాజస్థాన్‌ రాష్ట్రం రాజ్‌సమంద్‌లోని ప్రతిష్ఠాత్మక శ్రీనాథ్‌జీ ఆలయంలో  ఆకాశ్‌ అంబానీ చేతుల మీదుగా ఈ సేవలు ప్రారంభమయ్యాయి.
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలలో 5జీ సేవలను ప్రారంభించిన జియో వెల్కమ్ ఆఫర్‌ను లాంచ్ చేసింది. మిగతా నగరాలకు కూడా సేవలను విస్తరించేందుకు జియో కృషి చేస్తోంది. జియో ట్రూ 5జీ పైలట్ బీటా ట్రయల్‌‌ను చెన్నైతోపాటు రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాకు విస్తరించినట్టు ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.
ఇది జియో ట్రూ 5జీ సేవలకు అదనమని చెప్పారు. అలాగే, జియో వెల్కమ్ ఆఫర్‌ను ఇటీవల ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలలో జియో ప్రారంభించింది. 5జీ సేవలు ఏ ఒక్కరికో లేదంటే పెద్ద నగరాలకే పరిమితం కాదని పేర్కొన్న ఆకాశ్ అంబానీ 5జీ సేవలు దేశంలోని ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి, ప్రతి వ్యాపారానికి అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
ప్రతి భారతీయుడికి అందుబాటులోకి తీసుకు రావడంతో ఇదో అడుగు అని పేర్కొన్నారు.  30 ఏళ్ల ఆకాశ్ అంబానీ ఆర్ఐఎల్ చైర్మన్‌గా నియమితులయ్యాక చేసిన తొలి అతిపెద్ద ప్రకటన ఇదే కావడం గమనార్హం. గత జనవరిలో తండ్రి ముకేశ్ అంబానీ నుండి ఆయన చైర్మన్ పదవి చేపట్టారు.
 
ఈ ఏడాది పూర్తయ్యే లోపల దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై సహా ప్రధాన నగరాలన్నింటిలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్‌ జియో కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నది. 
ఇక 2023 డిసెంబర్‌ నాటికి దేశంలోని ప్రతి పట్టణానికి, మండలానికి, తాలూకాకు 5జీ నెటవర్క్‌ను విస్తరించాలన్నది తమ ఉద్దేశమని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ గత ఆగస్టులో ప్రకటించారు.  రిలయన్స్‌ కంపెనీ 5జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం రెండు లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది.