పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. సికింద్రాబాద్‌ – తిరుపతి, తిరుపతి – సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ – యశ్వంతపూర్‌, యశ్వంతపూర్‌ – హైదరాబాద్‌, నాందేడ్‌ – పూరి, పూరి – నాందేడ్‌ మధ్య రైళ్లు నడుపనున్నట్లు తెలిపింది.
 
సికింద్రాబాద్‌ – తిరుపతి (రైలు నం.07469) 25న నడువనున్నది. సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి – సికింద్రాబాద్‌ (రైలు నం.07469) రైలు 26న రాత్రి 8.15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనున్నది.
 
రైలు రెండుమార్గాల్లో జనగామ, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట జంక్షన్ల ఆగుతుందని పేర్కొంది. హైదరాబాద్‌ – యశ్వంతపూర్‌ (రైలు నంబర్ 07233) స్పెషల్ ట్రైన్‌ 25, 27 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుంది.
 
యశ్వంత్‌పూర్ – హైదరాబాద్ (రైలు నంబర్ 07234) స్పెషల్ సోమ, బుధవారాల్లో యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 03.50గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుందని పేర్కొంది. రైలు సికింద్రాబాద్‌, కాచిగూడ, ఉమ్దానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తిరోడ్‌, గద్వాల, కర్నూలు సిటీ, డోన్‌, అనంతపురం, ధర్మవరం, పెనుకొండ, హిందుపురం, యెహలంక స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.నాందేడ్‌ – పూరి (07565) రైలు 26న మధ్యాహ్నం 3.25 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి.. మరుసటి రోజు సాయంత్రం 05.30 గంటలకు పూరీ చేరుకుంటుంది. 27న పూరీ – నాందేడ్‌ రైలు రాత్రి 10.45 గంటలకు పూరీలో బయలుదేరి రెండోరోజు వేకువ జామున ఒంటిగంటకు నాందేడ్‌ చేరుకుంటుంది.

రైలు ముఖ్‌దేడ్‌, ధర్మాబాద్‌, బాసర, నిజామాబాద్‌, కామారెడ్డి, మేడ్చల్‌, సికింద్రాబాద్‌, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళంరోడ్‌, పలాసా, బెర్హంపూర్‌, కుర్దారోడ్‌ స్టేషన్లలో రైలు ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.