
మాదక ద్రవ్యాలను ఎంత మాత్రం సహించేది లేదని స్పష్టం చేస్తున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వచ్చే ఆగస్టు 15నాటి వరకే లక్ష కిలోల డ్రగ్స్‌ను దహనం చేస్తామని వెల్లడించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా 75 వేల కిలోల మాదక ద్రవ్యాలను దహనం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. కానీ, ప్రభుత్వం ఇప్పటికే ఆ మార్కును దాటింది. అందువల్ల లక్ష కిలోలను కాల్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్‌లోని ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్‌కతా వంటి నాలుగు ప్రాంతాల్లో అధికారులు 30వేల కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఈ మాదక ద్రవ్యాలను దహనం చేసే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికీ చంఢీగఢ్ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వర్చువల్‌గా హాజరయ్యారు. ఆయన సమక్షంలో అధికారులు ఈ 30 వేల కిలోల డ్రగ్స్‌ను మంటల్లో కాల్చారు.
జూన్ 1కీ ముందు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో 30, 468కిలోల మాదక ద్రవ్యాలను మంటల్లో కాల్చింది. అనంతరం నాలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి జులై 29 వరకు 51, 217 కిలోల డ్రగ్స్‌ను దహనం చేసిది. ఎన్సీబీ లక్ష్యాన్ని అధిగమించి మొత్తంగా 81, 686కిలోల డ్రగ్స్‌ను కాల్చింది. ఈ సందర్భంగా అమిత్ షా వర్చువల్‌గా మాట్లాడారు.
‘‘ఇప్పటి వరకు 82వేల కిలోల మాదక ద్రవ్యాలను దహనం చేశామని చెప్పడానికి గర్విస్తున్నాం. ఆగస్టు 15నాటికీ లక్ష కిలోలను దహనం చేస్తాం’’ అని అమిత్ షా చెప్పారు. ఆరోగ్యకరమైన సమాజం, దేశం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నమని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల కొనుగోలు, అమ్మాకాల ద్వారా వచ్చిన ధనం దేశ భద్రతకు సురక్షితం కాదని చెప్పారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం