
హిందువులకు అత్యంత పవిత్రమైన వారణాసిలోని కాశీ విశ్వేశ్వరాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో కోర్టు నియమించిన అధికారుల బృందం సర్వే నిర్వహించింది. వీడియోలను చిత్రీకరించింది. ఈ సర్వేలో న్యాయవాదులు కూుడా పాల్గొన్నారు.
మసీదు వెనుక హిందూ ఆలయం ఆనవాళ్లు ఉన్నాయని, వాటిని సర్వేచేయించాలని పిటిషనర్లు కోరిన మీదట స్థానిక కోర్టు ఇందుకు అనుమతి మంజూరు చేసింది.ఈ మసీదు వెనక భాగంలో సర్వే జరిపించాలని ఐదుగురు మహిళలు గత ఏడాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మసీదు పశ్చిమంలో ఉన్నగోడను ఆనుకుని మా శింగార్ గౌరీ ఆలయం స్థలం ఉందనీ, ఆ స్థలంలో ఏడాదికి ఒకసారి పూజలు జరుపుకునేందుకు అనుమతి ఇస్తున్నారని వారు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, శృంగార్ గౌరీ ప్రదేశానికి పరిమితులు లేకుండా సంవత్సరం పొడువునా ప్రార్థనల కోసం తెరవాలని మహిళలు పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌పై స్థానిక కోర్టు అక్కడి ప్రదేశాన్ని పరిశీలించి మే 10 లోగా నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించింది. అయితే ఈ వివాదంపై ఓ న్యాయవాదిని కమిషనర్‌గా నియమించమని ఈ ఏడాది మార్చిలో మసీదు సంరక్షకుల కమిటీ స్థానిక కోర్టును అభ్యర్థించింది. స్థానిక కోర్టు అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.
ఈ సందర్భంగా ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు చేశారు. ఈ మసీదు స్థలంలో సర్వే జరుపుకోవడానికి తమకు అభ్యంతరం లేదనీ, కానీ, వీడియోతీయడానికి వీల్లేదని జ్ఞానవాపి కేర్‌టేకర్ కమిటీ స్పష్టం చేసింది.
ఈ మసీదులో సర్వే నిర్వహించాలన్నఅభ్యర్ధనపై ఏడాదిపైగా వివాదం సాగుతోంది. గత మార్చిలో మసీదు ఖాళీ స్థలంలో సర్వే నిర్వహించరాదని కోరుతూ మసీదు కేర్‌టేకర్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది.
More Stories
ఎవరెస్ట్‌పై మంచు తుఫానులో చిక్కుపోయిన వెయ్యి మంది
దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. కటక్‌లో కర్ఫ్యూ
రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు నిషేధం