
కేసీఆర్ అవినీతి ప్రభుత్వాన్ని తెలంగాణాలో గద్దె దించుతామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి వివేక్ వెంకట స్వామి విశ్వాసం వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘన నిర్వహంచారు. అంబేద్కర్ చిత్రపటానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్యెల్యే రఘునందన్ రావులతో పాటు పార్టీ నేతలు డా. కె. లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకట స్వామి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపిచ్చారు. అంబేద్కర్ రాజ్యాంగంతోనే తెలంగాణ వచ్చిందని చెబుతూ సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారని విమర్శించారు. ఓట్ల కోసమే కేసీఆర్ హామీలు ఇచ్చిండని అంటూ రాష్ట్రంలో కల్వకుంట్ల పాలన పోవాలని స్పష్టం చేశారు.
దళితుల ఓట్ల కోసం దళిత బందు అని చెప్పిండు… కానీ దళిత బంధువుడు అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఈ రోజు నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని పేర్కొంటూ దళితులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు. దళితుడిని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదేనని గుర్తు చేశారు.
బీజేపీకి అంబేద్కర్ ఆదర్శమని సంజయ్ పేర్కొంటూ అంబేద్కర్ పెట్టిన బిక్ష కారణంగానే తాను ప్రధాని అయినట్లు స్వయాన మోదీ చెప్పినట్టు గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామనేవారికి పుట్టగతులుండవని హెచ్చరించారు. 12 మంది ఎస్ సిలను బిజెపి పార్టీ కేంద్ర మంత్రులను చేసింది.
అంబేద్కర్ ను కాంగ్రెస్ అడుగడుగునా అవమనించిందని పేర్కొంటూ అంబేద్కర్ పోటీ చేస్తే కాంగ్రెస్ ఓడించిందని విమర్శించారు. బిజెపి పార్టీ అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చిందని చెబుతూ అంబేద్కర్ స్ఫూర్తిగా ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
More Stories
తెలంగాణ రాజకీయాల్లో శూన్యత .. భర్తీకి బిజెపి సిద్ధం
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సత్తాతో సహా 25 పార్టీలపై వేటు
తెలంగాణాలో మత పిచ్చి రాజకీయాలు సాగిస్తున్న కాంగ్రెస్