
పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రాత్రి 8 గంటలకు ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేషనల్ అసెంబ్లీ సమావేశం కాగానే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ సభ్యులు హంగామా సృష్టించారు.
షెహబాజ్ ఎన్నిక సమయానికి సభనుంచి వాకౌట్ చేశారు. తాను దొంగల సభలో కూర్చోలేనని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. జాతీయ అసెంబ్లీకి రాజీనామా కూడా ప్రకటించారు. పీటీఐ సభ్యులంతా రాజీనామాలు చేస్తారని ఇమ్రాన్ తెలిపారు.
ఇలా ఉండగా,పాకిస్థాన్‌లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని, పీఎంఎల్-ఎన్ సుప్రీం నవాజ్ షరీఫ్ తిరిగి స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పాక్ విడిచిపెట్టి గత కొద్దికాలంగా లండన్‌లో ఉంటున్న ఆయన ఈద్ పండుగ తర్వాత వచ్చే నెలలో పాక్ వస్తారని పీఎంఎల్-ఎన్ సీనియర్ నేత మియాన్ జావెద్ లతీఫ్ తెలిపారు.
పీఎంఎల్-ఎన్ భాగస్వామ్య పక్షాలతో కూడా నవాబ్ రాకపై చర్చిస్తున్నామని చెప్పారు. పనామా పేపర్ల కేసులో 2017 జూలైలో సుప్రీంకోర్టు నవజ్‌ను పదవి నుంచి తొలగించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై పలు అవినీతి కేసులు పెట్టింది.
లాహోర్ హైకోర్టు నవాజ్ చికిత్స కోసం నాలుగు వారాలు అనుమతి మంజూరు చేయడంతో 2019 నవంబర్‌లో ఆయన లండన్ వెళ్లారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని వైద్యులు నిర్ధారించి, ప్రయాణాలు చేయవచ్చని చెప్పగానే తాను పాకిస్థా్న్‌కు తిరిగి వస్తానని లాహోర్ హైకోర్టుకు ఆయన అండర్‌టేకింగ్ కూడా ఇచ్చారు.
అల్-అజిజియా మిల్స్ అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడిన నవజ్‌కు ఆ కేసులోనూ బెయిల్ మంజూరైంది. కాగా, పాకిస్థాన్‌లోని రాజకీయ అనిశ్చితిపై లతీఫ్ మాట్లాడుతూ, సంకీర్ణ ప్రభుత్వం ఆరు నెలలు కూడా మనుగడ సాధించలేదని, పాక్ కష్టాలు తీరాలంటే తాజాగా ఎన్నికలు నిర్వహించడమే ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు.
మరోవంక,పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అనుచరులు దేశం వదిలివెళ్లకుండా నిషేధం విధించింది ఎఫ్ఐఏ (ద ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ). ఎఫ్ఐఏ పాకిస్తాన్‌కు చెందిన అత్యున్నత విచారణ సంస్థ. ఎవరైనా పాకిస్తాన్ విడిచి వెళ్లకూడదంటే వారి పేర్లను ‘స్టాప్ లిస్ట్’లో చేరుస్తుంది ఎఫ్ఐఏ.
తాజాగా ఇమ్రాన్‌ఖాన్ అనుచరులు ఆరుగురి పేర్లను ఈ లిస్టులో చేర్చింది. ఇమ్రాన్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అజామ్ ఖాన్, స్పెషల్ అసిస్టెంట్ షాబాజ్ గిల్, సలహాదారు షాజాబ్ అక్బర్‌తోపాటు మరో ముగ్గురి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పేరును కూడా ఈ జాబితాలో చేర్చాలంటూ పిటిషన్ దాఖలైంది.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి