
ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ శ్రీధరన్ పిళ్లై ప్రమోద్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గోవాలోని డాక్టర్ శ్యమ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియం జరిపించారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు హాజరయ్యారు. ప్రమోద్ సావంత్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి ప్రమాణస్వీకారం చేసి ప్రమోద్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు 2019లో ఆయన మొదటిసారి గోవా సిఎంగా బాధ్యతలు చేపట్టారు.
కేబినెట్ మంత్రులుగా విశ్వజిత్ రాణే, మౌవిన్ గోదిన్‌హో, రావి నాయక్, నైలేష్ కాబ్రల్, సుభాష్ శిరోధ్కర్, రోహన్ కౌంటే, గోవింద్, గౌడే, అటాన్షియో మాన్‌సెరేట్ ప్రమాణస్వీకారం చేశారు. గోవాకు రెండు సార్లు సిఎంగా బాధ్యతలు చేపట్టిన 7వ వ్యక్తిగా ప్రమోద్ సావంత్ రికార్డు సృష్టించారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల గోవా అసెంబ్లీకి జరిగిన 40 స్థానాలకు ఎన్నికల్లో ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని బిజెపి పార్టీ 20 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్క సీటు తక్కువపడింది. అయితే.. ఎంజిపి, స్వతంత్ర ఎమ్మెల్యేలు బిజెపికి మద్ధతు పలికారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు బిజిపికి మార్గం సుగమమైంది.
అంతకుముందు 2012లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత పనాజీలోని క్యాంపల్ గ్రౌండ్‌లో మనోహర్ పారికర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.2017లో మనోహర్ పారికర్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రమోద్ సావంత్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యారు.
2019 మార్చిలో పారికర్ మరణం తర్వాత సావంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సావంత్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యునిగా పనిచేశారు. సావంత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సంఘ్ వార్షిక సంచాలన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.సావంత్ భార్య సులక్షణ కూడా చురుకైన బీజేపీ కార్యకర్త.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు