
మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2020, 2021 సంవత్సరాలకు 29 మంది విశిష్ట వ్యక్తులకు నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేశారు. మహిళా సాధికారత కోసం ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల కోసం విశేషంగా కృషి చేసినందుకు గుర్తింపుగా 14 అవార్డులు చొప్పున 2020, 2021 సంవత్సరాలకు మొత్తం 28 అవార్డులను రాష్ట్రపతి అందచేశారు.
అవార్డులు అందుకున్న వారిలో ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ సత్తుపాటి ప్రసన్న శ్రీకి నారీ శక్తి అవార్డుల లభించింది. గిరిజన భాషలకు లిపి రూపొందించినందుకు గానూ ఆమెకు ఈ పురస్కారం దక్కింది. లిపిలేని 19 భాషలను కాపాడేందుకు ఆమె ఎంతో కృషి చేసి.. లిపిని రూపొందించారు.
ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి మహిళ ప్రసన్న శ్రీ. ఆమె చేసిన కృషిని అభినందిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నారీ శక్తి పురస్కారాన్ని అందించారు. అలాగే తొలి మహిళా స్నేక్ రెస్క్యూవర్ గా పేరు పొందిన వనితా జగ్దేవ్ బొరాడేకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నారీ శక్తి అవార్డును ప్రదానం చేశారు. మహారాష్ట్రలోని బుల్ధానాకు చెందిన ఆమె కొన్నేళ్లుగా ప్రమాదకరమైన స్నేక్ రెస్క్యూవర్ ప్రొఫెషన్ ను ఎంచుకుని తన సత్తా చాటుతున్నారు.
మహిళా సంక్షేమం కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు గుర్తింపు ఇచ్చేందుకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ అవార్డులకు అంకురార్పణ చేసింది. నారీ శక్తి పురస్కారాలు అందుకున్న వారిలో సామాజిక వ్యాపారవేత్త అనితా గుప్తా, పేంద్రియ రైతు, గిరిజన హక్కుల కార్యకర్త ఉషాబెన్ దినేష్భాయ్ వాసవ ఉన్నారు.
అట్లాగే, ఇన్నోవేటర్ నసీరా అఖ్తర్, ఇంటెల్ ఇండియా హెడ్ నివృతి రాయ్, డౌన్ సిండ్రోమ్ బాధిత కథక్ నాట్యకళాకారిణి సాయిలీ నందకిశోర్ అగావానె, గణిత శాస్త్రవేత్త నీనా గుప్తా తదితరులు ఉన్నారు.
కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పురస్కార గ్రహీతలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. మహిళల సహకారం వల్లే మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయని ఆయన చెప్పారు.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం