
ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ జె ఎఫ్)కు అనుబంధంగా ఉన్న ‘పంజాబ్ పాలిటిక్స్ టీవీ’ యాప్‌లు, వెబ్సైట్, సామాజిక మాధ్యమాల ఖాతాలను నిలిపేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ టీవీ విదేశాల నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
ఎస్ ఎఫ్ జె చట్ట వ్యతిరేక సంస్థ అని చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, 1967 ప్రకారం ప్రభుత్వం ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. పంజాబ్ పాలిటిక్స్ టీవీ కార్యకలాపాలపై నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
పంజాబ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా ప్రజా భద్రత, శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ఆన్లైన్ మీడియాను ఈ టీవీ చానల్ ఉపయోగించుకుంటుందని నిఘా సమాచారం అందింది. ఈ టీవీ డిజిటల్ మీడియా రిసోర్సెస్‌ను బ్లాక్ చేయడానికి ఎమర్జెన్సీ అధికారాలను ఈ మంత్రిత్వ శాఖ వినియోగించింది.
ఈ టీవీ డిజిటల్ మీడియా కంటెంట్ మతపరమైన అశాంతిని, వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉందని నిఘా సమాచారం అందినట్లు ఈ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్