
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులు, ఏకాత్మ మానవతావాద ప్రబోధకుడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్రంలో అన్ని మండలాలలో పార్టీ కార్యకర్తలు `సమర్పణా దివాస్’ గా జరపాలని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా బిజెపి మండల ఆ పై స్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహిస్తూ పండిట్ దీన్ దయాళ్ జీ జీవితం మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సిద్ధాంతపరంగా బలం కలిగించే దీనదయాళ్ జీవితం, ఆయన ప్రతిపాదించిన అంశాలు బిజెపి ఆలోచనలు, కార్యక్రమాలకు ఆధారమని తెలిపారు.
ఈ సందర్భంగా మండల కేంద్రంగా, పోలింగ్ కేంద్రాల వారీగా సేవాసమర్పణ కార్యక్రమం నిర్వహించి, మండల స్ధాయిలో పార్టీ నిర్ణయించిన ప్రకారం మండల స్ధాయిలో దీన్ దయాళ్ జీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఈ విషయమై జిల్లా స్థాయి ఇన్ ఛార్జిలు ప్రత్యేక శ్రద్ద వహించాలని చెప్పారు.
రాష్ట్ర స్థాయి భాద్యతల్లో ఉన్నవారు కూడా పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. పార్టీ అనుబంధ శాఖల్లో భాద్యతలు ఉన్న వారు కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు. టెలికాన్ఫెరెన్స్ లో రాష్ట్ర స్థాయి భాద్యతలు ఉన్న వారితో పాటు జిల్లా ఇన్ ఛార్జ్ లు, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.
More Stories
శ్రీశైలం అభివృద్ధికి ప్రధానిని రూ. 1,657 కోట్లు కోరనున్న దేవస్థానం
పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ అదృశ్యం!
`త్రిశూల’ వ్యూహంతో జనసేన బలోపేతంపై పవన్ దృష్టి