దేశంలో `అత్యంత శక్తివంతమైన మహిళను’ 

నిత్యం వివాదాలను ఆహ్వానిస్తుంది ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత తనను తాను దేశంలోనే ‘అత్యంత శక్తివంతమైన మహిళ’గా ప్రకటించుకుంది. సోషల్ మీడియాలో ఆమె  భవిష్యత్తు పోస్ట్‌లను ఇక నుండి సెన్సార్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

దేశంలో శాంతిభద్రతల పరిస్థితి. ‘ట్విటర్ నిబంధనలను పదే పదే ఉల్లంఘించినందుకు’ అంటూ కంగనా ట్విట్టర్ ఖాతాను ఈ ఏడాది ప్రారంభంలో శాశ్వతంగా నిలిపివేశారు. రైతుల నిరసనపై కంగనా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఖార్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయాలని, ఆరు నెలల్లోగా ఛార్జిషీట్ దాఖలు చేయాలని కూడా  ఆ పిటీషన్ లో విజ్ఞప్తి చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా తన కథనానికి సంబంధించిన వార్తా నివేదికను పోస్ట్ చేసింది. “హా హ హ ఈ దేశంలో అత్యంత శక్తివంతమైన మహిళ,” అంటూ తన పోస్ట్‌పై కిరీటం ఎమోజీని జోడించి ఆమె రాసింది. తమ మత మనోభావాలను దెబ్బతీశారంటూ కంగనా రనౌత్‌పై సిక్కు వర్గానికి చెందిన వారు ఇటీవల ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ,   శిరోమణి అకాలీదళ్ నాయకులతో కలిసి అమర్జీత్‌సింగ్ సంధు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. నవంబర్ 21న ఫిర్యాదు మేరకు కంగనా ప్రొఫైల్‌లో ఇంగ్లీష్, హిందీలో రాసిన పోస్ట్‌ను వారు చూపారు.

ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన తర్వాత, `తను వెడ్స్ మను’ నటి  రెచ్చగొట్టే చిత్రాన్ని షేర్ చేస్తూ, “మరో రోజు మరో ఎఫ్‌ఐఆర్… నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే… ఇంట్లో మూడ్” అని రాశారు.  రైతుల నిరసన (కిసాన్ మోర్చా)ను రనౌత్ ఉద్దేశపూర్వకంగా ఖలిస్తానీ ఉద్యమంగా చిత్రీకరించారని, సిక్కు సమాజాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులుగా కూడా అభివర్ణించారని  గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ  ఆరోపించింది.

“మేము నటికి వ్యతిరేకంగా సెక్షన్ 295ఎ  (ఉద్దేశపూర్వకంగా,  హానికరమైన చర్యలు, వారి మతం లేదా మత విశ్వాసాలను అవమానించడం ద్వారా ఏ వర్గానికి చెందిన వారి మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసాము. మేము ఈ విషయాన్ని మరింత దర్యాప్తు చేస్తున్నాము”  ఖర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ గజానన్ కబ్దులే తెలిపారు.

కంగనా రనౌత్ ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్ధిఖీ,  అవ్నీత్ కౌర్ నటించిన టికు వెడ్స్ షేరు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆమె తొలి ప్రొడక్షన్ వెంచర్ కూడా. ఆమె రాబోయే చిత్రాలలో తేజస్, ధాకడ్, ఎమర్జెన్సీ ఉన్నాయి.