ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ముగిశాయి.  జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించిన అంత్యక్రియలకు సిరివెన్నెల కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు ఆయన అంతిమసంస్కారాలు నిర్వహించారు.  సిరివెన్నెల చితికి ఆయన జేష్ట కుమారుడు యోగీశ్వరశర్మ నిప్పంటించారు. 

ఉదయం ఫిలిం చాంబర్ లో ఆయన పార్ధీవదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. సిరివెన్నెల ఎంతో ఆత్మీయంగా పలకరించేవారని.. ఆయన లేని లోటు పూడ్చలేనిదని పలువులు ప్రముఖులు గుర్తుచేసుకున్నారు. అద్భుతమైన సాహిత్యంతో, వాస్తవాలకు దగ్గరగా సిరివెన్నెల పాటలు రాశారని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల పార్థీవదేహానికి నివాళులు అర్పించిన పలువురు సినీనటులు కన్నీటి పర్యంతం అయ్యారు.

కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల… గత నెల 24 నుంచి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ… నిన్న తుదిశ్వాస విడిచారు. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ముగిశాయి.  జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించిన అంత్యక్రియలకు సిరివెన్నెల కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు ఆయన అంతిమసంస్కారాలు నిర్వహించారు.

ఉదయం ఫిలిం చాంబర్ లో ఆయన పార్ధీవదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. సిరివెన్నెల ఎంతో ఆత్మీయంగా పలకరించేవారని.. ఆయన లేని లోటు పూడ్చలేనిదని పలువులు ప్రముఖులు గుర్తుచేసుకున్నారు. అద్భుతమైన సాహిత్యంతో, వాస్తవాలకు దగ్గరగా సిరివెన్నెల పాటలు రాశారని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల పార్థీవదేహానికి నివాళులు అర్పించిన పలువురు సినీనటులు కన్నీటి పర్యంతం అయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, రానా , నాగార్జున, వెంకటేష్, ఇలా మరెందరో సినిమా తారలు సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కడసారి చూసేందుకు వచ్చారు. సిరివెన్నెల నిర్జీవంగా ఉండటాన్ని చూసి బ‌రువెక్కిన హృద‌యంతో నివాళులు అర్పించారు.

కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల… గత నెల 24 నుంచి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ… నిన్న తుదిశ్వాస విడిచారు.  చిన్న‌పాటి అనారోగ్యంతో ఆసుప‌త్రికి వెళ్లాడ‌ని, స‌జీవంగా తిరిగి వ‌స్తాడ‌ని భావించిన అభిమానులంద‌రికి తీర‌ని శోకాన్ని మిగిల్చారు సిరివెన్నెల‌. 

గ‌త ఏడాది మ‌ర‌ణించిన‌ బాలు మ‌ర‌ణ వార్త‌ని ఇంకా ఎవ‌రు జీర్ణించుకోలేని ప‌రిస్థితిలో లేరు. అలాంటి పరిస్థితుల‌లో ఇప్పుడు సిరివెన్నెల హ‌ఠాన్మ‌ర‌ణం ప్ర‌తి ఒక్కరిని శోక‌సంద్రంలోకి నెట్టింది. ఆయ‌న మృతితో తెలుగు సాహిత్యం ఒక్కసారిగా మూగబోయినట్టుగా అనిపిస్తుంది. పాట ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయిందా… అన్న‌ట్టుగా ఉంద‌ని భావోద్వేగానికి గుర‌వుతున్నారు