ప్రకృతిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇందుకు ముఖ్యంగా యువతరం కంకణబద్ధులై ముందుకు కదలాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని ఎమెస్కో బుక్స్ సంస్థ ప్రచురించిన నర్సరీ రాజ్యానికి రారాజు – పల్ల వెంకన్న పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. మొక్కలను ప్రేమించిన పల్లా వెంకన్న.. వాటితో పాటే ఎదిగి మనకందరకూ స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు.
ఐదో తరగతి వరకే చదువుకున్నా ప్రకృతి విజ్ఞానాన్ని ఔపోసన పట్టి, కార్యదీక్ష, అనుభవంతో వృక్ష శాస్త్రవేత్తలకు సైతం సూచనలు ఇచ్చే స్థాయికి పల్లా వెంకన్న ఎదిగారని కొనియాడారు. వేగంగా పట్టణీకరణ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విచ్చలవిడిగా చెట్టు నరకడం వల్ల భూతాపం విపరీతంగా పెరిగిపోతోందని విచారం వ్యక్తం చేశారు.
పర్యావరణ అసమతౌల్యత ప్రకృతి విపత్తులకు కారణం అవుతున్నదని ఉపరాష్ట్రపతి తెలి
దేశమంతా తిరిగి దాదాపు మూడువేల రకాల మొక్కల్ని సేకరించి నర్సరీని అభివృద్ధి చేసిన వెంకన్న, ప్రతి ఇంట్లో పచ్చదనాన్ని పెంచడం ద్వారా దేశమంతా పచ్చదనాన్ని పెంచవచ్చని ఆకాంక్షించారని తెలిపారు. వ్యాపారదృష్టితోనే కాక, దేశ ప్రయోజనాల దృష్టితోనూ పని చేసిన ఆయన దేశభక్తి ముందుతరాలకు ఆదర్శనీయమని పేర్కొన్నారు.
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బీవీ పట్టాభిరామ్, ఎమెస్కో బుక్స్ సీఈఓ విజయకుమార్, ప్రముఖ పాత్రికేయులు కే రామచంద్రమూర్తి, రైతునేస్తం వ్యవస్థాపకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, పుస్తక రచయిత వల్లీశ్వర్, పల్ల వెంకన్న కుటుంబ సభ్యులతోపాటు పలు నర్సరీల యజమానులు, నర్సరీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

More Stories
తెలంగాణలో అంతర్జాతీయ చేపల ఎగుమతి కేంద్రం
శంషాబాద్ లో రూ. 3 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు
భారత్ అండర్ -19 జట్టు కెప్టెన్ గా హైదరాబాద్ కుర్రాడు