ఆమిర్ ఖాన్ టైర్ల కంపెనీ యాడ్‌ పై దుమారం

ఆమిర్ ఖాన్ టైర్ల కంపెనీ యాడ్‌ పై దుమారం

సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను వివాదాస్పద కాన్సెప్ట్‌లు, సీక్వెన్స్‌లతో తెరకెక్కించడం ఒక వంక వివాదాలకు దారితీస్తూ, తీవ్రమైన అభ్యంతరాలను ఎదుర్కొంటుండగా, తరచుగా వ్యాపార ప్రకటనలు సహితం అదే బాటలో నడుస్తున్నాయి.  ముఖ్యంగా  బాలీవుడ్‌ నటులు నటించే వ్యాపార ప్రకటనలు ముఖ్యంగా సున్నితమైన అంశాలను యధాలాపంగా ప్రస్తావిస్తూ  సోషల్‌ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది.

ఈమధ్య వివాహ దుస్తులమ్మే ఓ బ్రాండ్‌ నటి అలియా భట్‌తో తీసిన ‘కన్యాదాన్‌’ అడ్వర్టైజ్‌మెంట్‌ తీవ్ర విమర్శలకు గురయింది.  ఆ వేడి చల్లారకముందే తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ నటించిన చేసిన ఓవ్యాపార ప్రకటనపై తీవ్ర దుమారం చెలరేగుతున్నది. ఆమిర్ ఖాన్ నటించిన సీయట్‌ టైర్ల కంపెనీ యాడ్‌ ఒకటి ఈమధ్య విడుదల అయ్యింది. ‘‘రోడ్లు ఉంది పటాసులు (టపాకులు) పేల్చడానికి కాదు’’ అంటూ ఆ టైర్లను ప్రోత్సహించడం కోసం  తన ఎదురుగా ఉన్న జనాలకు హితోక్తులు చెప్పడం వివాదాలకు దారితీస్తుంది. 

అమీర్‌ ఖాన్‌ ఈ యాడ్‌ చేయడం, పైగా తమ మతాన్ని కించపరిచేదిగా ఉందంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.  ఆ అభ్యంతరాలు తారాస్థాయికి చేరగా.. సీయట్‌ను బాయ్‌కాట్‌ చేయాలంటూ  Boycott_Hinduphobic_CEAT వేల ట్వీట్లు, రీట్వీట్లతో నింపేస్తున్నారు. ఈ యాడ్‌ చేసింనందుకు నటుడు ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని, యాడ్‌ను తొలగించాలని సీయట్‌ కంపెనీని మరికొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక కొందరైతే ఆర్‌పీజీ గ్రూప్‌ చైర్మన్‌ హర్ష గోయంకాను సహితం వివాదంలోకి తీసుకొస్తున్నారు. 

గతంలోనూ ఇలా సున్నితమైన అంశాలపై హర్ష గోయెంకా అనుచిత ట్వీట్లు వేశాడని, ఆ సమయంలోను బాయ్‌కాట్‌ ఉద్యమం నడిచిందని కొందరు స్క్రీన్ షాట్లను రీట్వీట్లు చేస్తున్నారు. మతాన్ని, పండుగల్ని కించపరిచేలా సీయట్‌ కంపెనీ ప్రకటనలు తీయాల్సిన అవసరం, అందులో ఆమిర్‌ ఖాన్‌ లాంటి స్టార్‌ నటించాల్సిన అవసరం ఏముందని చాలామంది ప్రశ్నిస్తున్నారు.