భారత్‌లో 20 లక్షల వాట్సాప్‌ ఖాతాలు మూసివేత

భారతదేశంలో ఇటీవలి కాలంలో దాదాపు 20 లక్షల వాట్సాప్‌ ఖాతాలు మూసివేతకు గురయ్యాయి. భారతదేశంలోని ఐటీ నియమాలతోపాటు వాట్సాప్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించడంతో ఈ చర్యలకు ఉపక్రమించారు. అవాంఛిత సందేశాలను నిలిపివేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సంస్థ స్పష్టం చేసింది.

ఆగస్టులో భారతదేశంలో 20 లక్షకు పైగా ఖాతాలను వాట్సాప్‌ సంస్థ మూసివేసింది. వాట్సాప్ నెలవారి నివేదిక నుంచి ఈ సమాచారం బయటకు వెల్లడైంది. వాట్సాప్ భారతదేశంలో జూన్ 16 నుంచి జూలై 31 వరకు 3 లక్షల ఖాతాలను మూసివేసింది. 594 ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు వాట్సాప్‌ తెలిపింది.

 ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి నెల 80 లక్షల ఖాతాలను వాట్సాప్‌ మూసివేస్తున్నట్లు సమాచారం. అనుమతి లేకుండా ఆటోమేటెడ్ లేదా బల్క్ మెసేజ్‌లు పంపినందుకు 20.70 లక్షల ఖాతాలను నిషేధించారు. వాట్సాప్‌ నివేదిక ప్రకారం, ఆగస్టులో 420 ఫిర్యాదులు అందాయి. యూజర్ సెక్యూరిటీ రిపోర్టులో ఫిర్యాదులు అందుతున్నట్లు వాట్సాప్ ప్రతినిధి తెలిపారు.