ఆర్‌ఎస్‌ఎస్ రిజర్వేషన్లకు “బలమైన మద్దతుదారు” అని స్పష్టం చేస్తూ అది నిశ్చయాత్మక చర్యకు ఒక సాధనం అని, సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గం “అసమానతను” అనుభవిస్తున్నంత వరకు కొనసాగవలసిందే అని ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ (ప్రధాన కార్యదర్శి) దత్తాత్రేయ హోసబాలె తెలిపారు. రిజర్వేషన్లు, వివిధ సామజిక వర్గాల మధ్య సయోధ్య ఒకటి కలిసిపోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. దళితుల సహకారం లేకుండా భారతదేశ రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక చరిత్ర అసంపూర్ణంగా, అవాస్తవంగా ఉంటుందని కూడా దత్తాత్రేయ తేల్చి చెప్పారు.
గురు ప్రకాష్ పాశ్వాన్, సుదర్శన్ రామబద్రన్ రచించిన “మేకర్స్ ఆఫ్ మోడరన్ దళిత్ హిస్టరీ” అనే పుస్తకాన్ని ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరిస్తూ తాను, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ కుల ఆధారిత రిజర్వేషన్లకు మద్దతుదారులమని హోసబలే స్పష్టం చేశారు.
“నేను రిజర్వేషన్‌కి గట్టి మద్దతుదారునిగా ఉన్నాను … పాశ్చాత్య దేశాలలో, ఐరోపా, అమెరికాలలో, ఆఫ్రికన్ నల్లజాతీయుల నుండి సయోధ్య కోసం ప్రయత్నం జరిగింది. రిజర్వేషన్, సయోధ్య రెండూ ఒకదానితో ఒకటి కలిసిపోవాలి, ”అని ఆయన చెప్పారు. రిజర్వేషన్ అనేది చారిత్రాత్మక అవసరమైనా, భవిష్యత్తు కోసం సయోధ్య అవసరమని ఆయన తెలిపారు.
“సామాజిక సామరస్యం, సామాజిక న్యాయం మాకు రాజకీయ వ్యూహాలు కావు. ఈ రెండూ మాకు విశ్వాసానికి సంబంధించిన కథనాలు” అని కూడా ఆయన తెలిపారు. రిజర్వేషన్ అనేది భారతదేశానికి “చారిత్రక అవసరం” అని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థలలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగ వర్గాలకు కోటాలను అనుమతించే కుల-ఆధారిత రిజర్వేషన్లను సంఘ్ వ్యతిరేకులు వ్యతిరేకించినప్పటికీ; కులతత్వాన్ని ఖండించడంలో ఆర్‌ఎస్‌ఎస్ ముందంజలో ఉందని హోసబలే ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.
దళిత వర్గాలలో గుర్తింపుల సమస్యపై, అది ఉద్భవిస్తోందని తాను గమనించానని చెప్పారు. అయితే అది సమాజానికి మంచిదా చెడ్డదా అని చెప్పడం చాలా తొందరపాటుగా ఉందని ఆయన పేర్కొన్నారు.
“నేను ఉత్తర ప్రదేశ్‌లో ఉంటాను. దేశవ్యాప్తంగా పర్యటిస్తాను. నేను చాలా మందిని కలుస్తాను. నేను ఒక అనుభూతిని అనుభవించాను … గుర్తింపు అనేది దళితునికే పరిమితం కాదు; దళితులలో గుర్తింపుల ప్రశ్న మేధావులు ఉద్దేశపూర్వకంగా లేవనెత్తుతున్నారు. నేను దాని కోసం లేదా దానికి వ్యతిరేకంగా ఉన్నానని చెప్పడం లేదు, నేను ఒక పరిశీలన మాత్రమే చేస్తున్నాను. అటువంటి అభివృద్ధి సమాజానికి మంచిదా కాదా అని చెప్పడం చాలా తొందరగా ఉంది, ”అని ఆయన వివరించారు.
సమాజంలో సామాజిక మార్పుకు నాయకత్వం వహించిన వ్యక్తులను “దళిత నాయకులు” గా పేర్కొనడం అన్యాయమని, వారు మొత్తం సమాజానికి నాయకులని ఆయన స్పష్టం చేశారు.
“సమాజంలోని ఎస్సీ, ఎస్టీ విభాగాల వివిధ అంశాలపై మనం చర్చించినప్పుడు, రిజర్వేషన్ వంటి కొన్ని అంశాలు ఎల్లప్పుడూ ముందుకు వస్తాయి. 1980లలో దేశ వ్యాప్తంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు జరిగుతున్నడు, మేము మా నిబద్ధతను నిరూపించుకున్నాం. రిజర్వేషన్లకు మద్దతుగా పాట్నాలో ఒక తీర్మానం చేసాము. ఒక సెమినార్‌ను కూడా నిర్వహించాము”అని హోసబాలే వివరించారు.

More Stories
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?
అమెరికా గుప్పిట్లో పాక్ అణ్వాయుధాలు
కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీని అడ్డుకున్న బీజేపీ