
మాన్సాన్, సింహాచలం భూముల వ్యవహారంపై ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఆదేశించింది. నోడల్ అధికారిగా దేవాదాయ శాఖ కమిషనర్‌ను నియమించింది.
ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన దేవాదాయ త్రిసభ్య కమిటీ ఇప్పటికే ప్రాథమిక నివేదికను అందించింది. మాన్సాస్ భూముల అమ్మకాల్లో రూ. 74 కోట్లు నష్టం వాటిలినట్లు కమిటీ తేల్చింది. సింహాచలం ఆలయ ప్రాపర్టీ రిజిస్ట్రార్‌లో 860 ఎకరాల భూములు గల్లంతైనట్లు అంచనా. ఈ వ్యవహారంలో ఇప్పటికే అడిషనల్ కమిషనర్ రామచంద్ర మోహన్, డిప్యూటీ ఇవో సూజాతను సస్పెండ్ చేసిన సంగతి విదితమే.
మరోవంక, మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ గా తనను నియమించే విధంగా ఆదేశాలివ్వాలని ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతిరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మరోసారి అశోక్ గజపతిరాజు, ఆనంద గజపతిరాజు కుటుంబాలు మధ్య విభేదాలు బయటపడ్డాయి.
ఇప్పటికే ప్రభుత్వం ఊర్మిళ గజపతిరాజుని మాన్సస్ ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా నియమించింది. కానీ నేటి వరకు బోర్డ్ సభ్యురాలుగా ఊర్మిళ ప్రమాణ స్వీకారం చేయలేదు. మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచైత గజపతిరాజు నియామకాన్ని ఆమె మొదటి నుంచి తప్పుపడుతూనే వస్తున్నారు. మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు తిరిగి బాధ్యతలు స్వీకరించిన నేపధ్యంలో, అశోక్ ని తప్పించి తనకి చైర్మన్ అవకాశం ఇవ్వాలి అంటూ ఊర్మిళ హైకోర్టు ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు