బెంగాల్ ఎన్నికల అనంతర హింసపై ఎన్ఐఏ దర్యాప్తు!

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల అనంతర హింసకు సంబంధించిన దర్యాప్తును సిబిఐ లేదా ఎన్‌ఐఎకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు కలకత్తా హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ సిబిఐ విచారణకు సిఫారసు చేయగా, ఎన్ఐఏ పేరుతెరపైకి రావడం సంచలనం సృష్టిస్తున్నది. .

జులై 3 న, తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు కలకత్తా హైకోర్టు ఐదుగురు సభ్యుల డివిజన్ బెంచ్ తెలిపింది. వచ్చే వారం మధ్యలో ఉత్తర్వులను ప్రకటించవచ్చని కోర్టు వర్గాలు ధృవీకరించాయి.  వివాదాస్పద విచారణ దాదాపు మూడు నెలల పాటు కొనసాగింది, ఈ సమయంలో మే 2 న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత పశ్చిమ బెంగాల్‌లో ప్రతీకార హింస ఆరోపణపై పూర్తి నివేదిక సమర్పించాలని కలకత్తా హైకోర్టు  ఎన్‌హెచ్‌ఆర్‌సి ని ఆదేశించింది.

మే 2 నుండి మే 5 మధ్య ఎన్ని హింస కేసులు జరిగాయి? మే 5 తర్వాత మమతా బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున ఎన్ని హింసాత్మక కేసులు నమోదయ్యాయో కోర్టు తెలుసుకోవాలనుకుంది. ఎన్‌హెచ్‌ఆర్‌సి మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతి రాజీవ్ జైన్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది, ఇది 2,000 పేజీల నివేదికను సమర్పించింది.  50 మందికి పైగా హత్యకు గురయ్యారని,  

దాదాపు 23 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారని, అనేక ఇతర వ్యక్తులు అత్యాచారానికి గురయ్యారని నిర్ధారణ చేసింది.  పైగా హింసాయుత సంఘటనలో సంబంధం ఉన్నవారిలో ఎన్‌హెచ్‌ఆర్‌సి రాష్ట్రవ్యాప్తంగా 50 మంది టిఎంసి నాయకుల పేర్లను ఉదాహరించింది.

వేధింపు. అత్యాచారం జరగలేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఖండించింది. 13 మందికి మించి మరణించలేదని వాదిస్తున్నది.
ప్యానెల్ రాష్ట్ర  ప్రభుత్వ ధోరణిని తీవ్రంగా పరిగణించింది. పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితిని “చట్టానికి బదులుగా పాలకుడి చట్టం అభివ్యక్తి” అని పేర్కొంది.  “హత్య,  అత్యాచారం వంటి ఘోరమైన నేరాలపై” సిబిఐ విచారణకు సిఫార్సు చేసింది.

మమతా బెనర్జీ ఎన్‌హెచ్‌ఆర్‌సిని “కోర్టును అగౌరవపరిచినందుకు”,  వారి నివేదికను బిజెపి తన నివేదికను మీడియాకు లీక్ చేయడం ద్వారా బిజెపి “రాజకీయ ప్రతీకారం”కు పాల్పడుతున్నట్లు ధ్వజమెత్తారు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో, రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదిక పచ్చి అబద్ధాలతో నిండి ఉందని, జైన్, దర్యాప్తు కమిటీలోని ఇతర సభ్యులు గతంలో బిజెపితో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించింది.

ఎన్ఐఏ సాధారణంగా తీవ్రవాద దాడులు లేదా తీవ్రవాద సంబంధాలపై దర్యాప్తు చేయడానికి నిమగ్నమై ఉంటుంది. కాబట్టి, ఇది ఉగ్రవాద కోణానికి సూచికేనా? అనే అనుమానం కలుగుతున్నది.  కోల్‌కతాలో ఉన్న కేంద్ర సాయుధ పోలీసు దళానికి చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ, “సరిహద్దు ప్రాంతాల్లో హింస జరిగినందున  ఎన్ఐఏ  కి ఆ పని అప్పగించవచ్చని సమర్పించారు. 

పైగా, ఈ హింసలో బంగ్లాదేశ్ సంబంధాన్ని తోసిపుచ్చలేమని ఆ అధికారి పేర్కొన్నారు. “హింసకు పాల్పడిన వ్యక్తులకు కొంతమంది బయటి వ్యక్తులు వనరులు అందించారు. హింసాత్మక సంఘటనలు వాటిని స్పష్టం చేస్తున్నాయి” అని ఆరోపించారు. మరోవంక, బెంగాల్ మంత్రి జ్యోతిప్రియో ముల్లిక్ ఎన్‌హెచ్‌ఆర్‌సి నివేదికలో నిందితుడిగా పేర్కొన్న అపరాధిగా తన పేరును తొలగించాలని కలకత్తా హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. “నా ప్రతిష్ట,   గౌరవం రెండూ కుదుపుకు గురయ్యాయి” అని ముల్లిక్ పేర్కొన్నారు.