కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) డెరెక్టర్‌గా ఐపిఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైశ్వాల్ నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ, కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నే అధీర్ రంజన్ చౌదరిలతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీ మంగళవారం ఆయన నియమకానికి పచ్చ జెండా ఊపింది.
ఝార్ఖండ్ కు చెందిన జై శ్వాల్ 1985 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ అధికారి. ప్రస్తుతం సిఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో 10 ఏళ్లపాటు కేంద్ర నిఘా ఏజెన్సీ రా లో పనిచేయని అయన ఎప్పుడు సిబిఐ లో పనిచేయలేదు. మంగళవారంనాడు రాత్రి కేబినేట్ నియామకాల కమిటీ సుబోధ్ అపాయింట్‌మెంట్‌కు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. సిబిఐ డెరెక్టర్ పదవి గత ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఖాళీగా ఉంది.
అంతకు ముందు రిషీకుమార్ శుక్లా సిబిఐ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి అడిషినల్ డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా సిబిఐ తాత్కాలిక చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. 90నిమిషాల సుదీర్ఘ సమావేశం తర్వాత జైశ్వాల్ నియామకానికి అత్యున్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. జైశ్వాల్ రెండేళ్ల పాటు సిబిఐ డెరెక్టర్‌గా పదవిలో ఉండనున్నారు.
జైస్వాల్ మహారాష్ట్రలో పలు కీలక పోస్ట్ లలో పనిచేశారు. పలు సంచలన కేసుల దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్ర ఎటిఎస్ తో పాటు ముంబై పోలీస్ కమీషనర్ గా, మహారాష్ట్ర డిజిపిగా పనిచేశారు. పోలీసుల బదిలీలలో రాజకీయ, దళారుల జోక్యం విషయమై ఆయన మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశముఖ్ తో వివాదంకు దిగారు.
ముంబై మాజీ పోలీస్ కమీషనర్ పరం బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలతో హోమ్ మంత్రి పదవి కోల్పోయిన అనిల్ దేశముఖ్ పై ఇప్పుడు జరుగుతున్న సిబిఐ దర్యాప్తును డైరెక్టర్ గా జైస్వాల్ పర్యవేక్షింపనున్నారు. మహారాష్ట్ర రాష్ట్ర రిజర్వు పోలీస్ అధిపతిగా తర్వాత సిబిఐ దర్యాప్తు చేపట్టిన తెల్గీ కుంభకోణంపై విచారణ జరిపారు. ఎటిఎస్ లో పనిచేస్తుండగా 2006లో మాల్గావ్ ప్రేలుడు కేసు దర్యాప్తులో ఆయన కూడా భాగస్వామి.
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రంలో రా లో పనిచేస్తున్న ఆయనను ముంబై పోలీస్ కమీషనర్ గా తీసుకు వచ్చారు. తర్వాత డిజిపి అయ్యారు. ఎల్గార్ పరిషద్, భీమా కోరెగాన్ హింస కేసులను సీబీఐకి బదిలీ చేయడానికి ముందు డిజిపిగా ఆయన పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగాయి.
ఉద్దవ్ థాకరే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీస్ యంత్రాంగం నిర్వహణలో తరచూ ప్రభుత్వంతో, ముఖ్యంగా శివసేనతో బేధాభిప్రాయాలు ఏర్పడుతూ ఉండెడివి. అనిల్ దేశముఖ్ హోమ్ మంత్రిగా ఉండగా పోలీస్ శాఖలో పోస్టింగ్ ల కోసం పెద్దఎత్తున లాబీ జరుగుతూ ఉండడం పట్ల జైస్వాల్ బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పోలీస్ బదిలీల విషయంలో “దళారీల” పాత్రను బహిర్గతం చేస్తూ రాష్ట్ర పోలీస్ నిఘా విగభాగం అధిపతి రష్మీ శుక్లా `ఫోన్ టాగ్’ ను వెల్లడి చేశారు.
ఈ ఉదంతంపై సిఐడి దర్యాప్తు కోరిన ఆమెనే ప్రభుత్వం తప్పుబట్టింది. ఆమెపై విచారణకు ఆదేశించింది. ఆమె ఇప్పుడు హైదరాబాద్ లోని సిఐఎస్ఎఫ్ లో పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో `రాజీ’ పడలేక జైస్వాల్ కేంద్ర సర్వీస్ కు వెళ్లిపోయారు.

More Stories
అమెరికా గుప్పిట్లో పాక్ అణ్వాయుధాలు
కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీని అడ్డుకున్న బీజేపీ
అత్యంత వేగంగా భారత్ ఆర్థిక వ్యవస్థ