ప్రముఖ పర్యావరణ వేత్త సుందరలాల్ బహుగుణ కరోనా కారణంగా నేడు రిషికేష్ లోని ఎయిమ్స్ లో మృతి చెందారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన మే 8న ఆసుపత్రిలో చేరారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు.
ఆయన మూర్తి దేశానికి గొప్ప నష్టం చేకూరుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ప్రకృతితో సమనవ్యయంతో జీవితాలనే మన శతాబ్దాల తరబడి విలువలకు ఆయన ప్రతిబింబం అని ప్రధాని పేర్కొన్నారు. ఆయన సాధారణ జీవనం, కారుణ్యం స్ఫూర్తి లను ఎప్పటికి మరచిపిలేమని చెప్పారు. ఆయన కుటుంభం, అసంఖ్యాక అభిమానులను ఆయన ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఆయన మృతి పట్ల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ్ సింగ్ రావత్ ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ ఆయన మృతి కేవలం ఉత్తరాఖండ్, భారత్ లకు మాత్రమే కాకూండా మొత్తం ప్రపంచానికి తీర్చలేని లోటు అని ఘనంగా నివాళులు అర్పించారు. చిప్కో ఉద్యమాన్ని ఒక ప్రజా ఉద్యమమగా మలచిన నేత అని కొనియాడారు.
అడవులు, హిమాలయ ప్రాంతాల విధ్వంసం గురించి గ్రామీణ ప్రజలలో అవగాహన కలిగిస్తూ, వాటి పరిరక్షణ కోసం కృషి చేస్తూ తన జీవితం అంతా గడిపారు. ఆయన విజ్ఞప్తి మేరకు 1980లో చెట్లు నరకడాన్ని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 15 ఏళ్ళ పాటు నిషేధించారు.
ఇందిరాగాంధీ హయాంలో ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించినా ఆయన తిరస్కరించారు. అయితే 2009లో ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం అందించింది. “పర్యావరణమే శాశ్వత ఆర్ధిక వనరు” అన్న ఆయన నినాదం విశేషంగా ప్రాచుర్యం పొందింది. ఆయన నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణ కోసం చిప్కో ఉద్యమం రూపొందింది.
చిప్కో ఉద్యమం 1973 లో చెట్ల పరిరక్షణ లక్ష్యంగా అహింసాత్మక ఆందోళన. అడవులను సంరక్షించడం కోసం మహిళల సమిష్టి సమీకరణకు ఇది ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఇది వైఖరిలో మార్పుకు కూడా దోహదపడింది. చెట్లను నరికి, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవటానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు 1973 లో ఉత్తర ప్రదేశ్ చమోలి జిల్లాలో (ఇప్పుడు ఉత్తరాఖండ్) ఉద్భవించింది. కొద్దీ సాయంలోనే ఈ ఉద్యమం ఉత్తర భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది.
గ్రామస్తులు చెట్లను కౌగిలించుకుని, హ్యాక్ చేయకుండా ఉండటానికి వాటిని చుట్టుముట్టడంతో ‘ఆలింగనం’ అనే పదం నుండి ‘చిప్కో’ అనే ఉద్యమం పేరు వచ్చింది. 1990వ దశకంలో తెహరీ డ్యామ్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిపారు. 1995లో జైలుకు కూడా వెళ్లారు.

More Stories
భారత్ పై 50 శాతం సుంకాలను ముగించాలని అమెరికాలో తీర్మానం!
నోబెల్ గ్రహీత నర్గెస్ మొహమ్మది అరెస్ట్
భారత్, చైనా, రష్యా, జపాన్ లతో ట్రంప్ సి-5 ఏర్పాటు!