
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధికారంలో కొనసాగడానికి నైతిక విలువలను కోల్పోయారని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావలే స్పష్టం చేశారు. హోంశాఖ మాజీ మంత్రి అవినీతిపై నైతిక బాధ్యత వహిస్తూ ఠాక్రే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
‘అనిల్ దేశ్‌ముఖ్ పదవీవిరమణ చేసారు. కాని అతను అంతకుముందే పదవి నుంచి తప్పుకోవాల్సి ఉండె. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కూడా అధికారంలో కొనసాగడానికి నైతికతను కోల్పోయారు. వెంటనే రాజీనామా చేయాలి’ అని అథావలే చెప్పారు.
ప్రజలను రక్షించాల్సిన పోలీసు అధికారి ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇదే మొదటిసారి అని అథవాలే అన్నారు. ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలపై ముంబై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన తరువాత మాత్రమే దేశ్‌ముఖ్ ఎందుకు రాజీనామా చేశారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.
కొవిడ్-19 పరిస్థితిని తప్పుగా నిర్వహిస్తున్నారంటూ మహా వికాస్ అగాది ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అథవాలే.. ‘దిగజారుతున్న కొవిడ్-19 పరిస్థితులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మహారాష్ట్రలో నిత్యం కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ దేశ్‌ముఖ్ సోమవారం ఉద్ధవ్ ఠాక్రేకు రాజీనామా సమర్పించారు. అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీసు కమిషనర్ చేసిన అవినీతి ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ ప్రారంభించాలని బొంబాయి హైకోర్టు సోమవారం సీబీఐని ఆదేశించడంతో ఈ పరిణామాలు జరిగాయి.
More Stories
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
అభద్రతా భావంతోనే అమెరికా సుంకాలు
కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు