
రావణుడి స్థానంలో రామ భక్తులు (బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి) ఉండుంటే సీత మరో హత్రాస్ బాధితురాలయ్యుండేదని అంటూ సీతారాములపై టిఎంసి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అభ్యంతరకర వాఖ్యలు చేయడం పట్ల బీజేపీ కార్యకర్తలు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆయనపై భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నేత అశిష్ జైశ్వాల్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని ఆయన ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదు చేయడమే కాకుండా తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
హౌరా జిల్లాలోని గోరబలి పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆయన క్షమాపణ చెప్పాలని హౌరా జిల్లా మైథిలి సమాజ్ కూడా డిమాండ్ చేసింది.
24 గంటలలో క్షమాపణ చెప్పని పక్షంలో నిరసన ప్రదర్శన జరుపుతామని హెచ్చరించింది. సీతామాతను అవమాన పరుస్తూ ఎంపీ చేసిన వ్యాఖ్యలు మొత్తం మహిళలను కించపరచడమే అంటూ మండిపడింది.
కథువాలో అసిఫాపై హత్యాచారం అనంతరం సోషల్ మీడియాలో ఒక కార్టూన్ వైరల్ అయింది. అందులో ‘‘నన్ను అపహరించింది రావణుడు కాబట్టి సరిపోయింది, అదే మీ భక్తులకు నేను దొరికి ఉంటే..?’’ అని రాముడితో సీత అంటుంది.
పశ్చిమ బెంగాల్‌లో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ సరిగ్గా ఇవే వ్యాఖ్యల్ని ఊటంకించారు. కాగా, కల్యాణ్ బెనర్జీపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మేఘాలయ గవర్నర్ తతాగత రాయ్ అయితే ట్విట్టర్ ద్వారా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఈ మనిషి తెలుసా? కల్యాణ్ బెనర్జీ అని బ్రాహ్మణ పేరు పెట్టుకున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
More Stories
అన్ని రంగాల్లోనూ స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించాలి
లేహ్‌లో ఆందోళనల వెనుక కుట్ర.. నలుగురు మృతి
దంతెవాడలో లొంగిపోయిన 71 మంది మావోయిస్టులు