ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. రాజమండ్రిలో శ్రీరామనగర్‌లోని విఘ్నేశ్వరాలయంలో విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉపాలయంలో విగ్రహం రెండు చేతులు ధ్వంసం చేశారు. విగ్రహం ధ్వంసంపై స్థానికుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత హిందూ వ్యతిరేక శక్తులు ఒక పథకం ప్రకారమే హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నాయి. దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం, కనీసం కేసులు నమోదు చేయకపోవడం దారుణం. హిందువుల మనోభావాలు సీఎం జగన్‌రెడ్డికి అవసరం లేదా?’’ అని బజరంగ్దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా శుక్రవారం బజరంగ్దళ్ ఆధ్వర్యంలో కోఠి చౌరస్తాలో జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడంతో పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చందర్ మాట్లాడుతూ ఆంధ్రాల్లో పథకం ప్రకారం దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంతో పాటు దోషులను పట్టుకునేందుకు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

More Stories
దుర్గగుడి అభివృద్ధికి త్వరితగతిన మాస్టర్‌ప్లాన్
జిఎస్టి ఆదాయం తగ్గడంపై ఏపీ ఆర్థికశాఖ ఆందోళన
మహిళా క్రికెటర్ శ్రీచరణికి గ్రూప్1 ఉద్యోగం, రూ. 2.5 కోట్ల నగదు