‘ది హిందూ’ పత్రికలో ఇరాన్‌కు అనుకూలంగా మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన వ్యాసంపై భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ తీవ్రంగా స్పందించారు. ఆ వ్యాసంలో, యూదు రాజ్యమైన ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో సోనియా గాంధీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు మద్దతు ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారత్ ఇరాన్‌కు మద్దతు ఇవ్వాలని, అలాగే మోదీ ప్రభుత్వం ఒక పక్షం వహించకుండా దౌత్య సమతుల్యతను పాటిస్తోందని ఆమె ఆరోపించారు.
తన అభిప్రాయాలను వ్యక్తం చేసే గాంధీ హక్కును అంగీకరిస్తూనే, ఆమె వంటి నాయకులు ప్రాంతీయ (మధ్యప్రాచ్యం) పరిస్థితిపై అవగాహన కలిగి ఉండాలని ఇజ్రాయెల్ రాయబారి సూచించారు. ఈ ప్రాంతంలో మూడు దశాబ్దాలుగా ఇరాన్ చేస్తున్న దురాక్రమణను విస్మరించలేమని పేర్కొంటూ, “మీరు ప్రస్తావించిన వ్యక్తి (సోనియా గాంధీ) 7 అక్టోబర్ 2023 నాటి దాడులను (హమాస్ దాడిని) ఖండించకపోవడం మాకు నిరాశ కలిగించింది. గత మూడు దశాబ్దాలుగా ఇరాన్ చేస్తున్న దురాక్రమణను విస్మరించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.” అని తెలిపారు.
తన వ్యాసంలో, సోనియా గాంధీ ఇరాన్‌ను పాశ్చాత్య ఆధిపత్యానికి, ఇజ్రాయెల్ దురాక్రమణకు బాధితురాలిగా చిత్రీకరించారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణలో ఇరాన్ పక్షం వహించడం గురించి ఆమె మాట్లాడారు. ‘బాధ్యతాయుతంగా, గట్టిగా మాట్లాడాలని’ గాంధీ మోదీ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. అలాగే భారతదేశం మౌనంపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.
ఇరాన్ భారతదేశానికి చాలాకాలంగా మిత్రదేశమని, అయితే ఇజ్రాయెల్‌తో వ్యూహాత్మక సంబంధాలు ఇటీవలివేనని గాంధీ పెక్రోన్నారు. అంతేకాకుండా, స్వతంత్ర పాలస్తీనాను ఊహించిన ద్విజాతి సిద్ధాంతానికి మద్దతు ఇచ్చే విదేశాంగ విధానాన్ని మోదీ ప్రభుత్వం విడిచిపెట్టిందని ఆమె ఆరోపించారు. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ, ఏకపక్ష చర్యలు తీసుకుంటోందని ఆమె ఇజ్రాయెల్‌పై ఆరోపించారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిరంతరం శాంతికి భంగం కలిగిస్తూ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. ఇరాన్‌కు మద్దతుగా ఆమె ఇలా రాశారు,: “1994లో, కాశ్మీర్ సమస్యపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌లో భారతదేశాన్ని విమర్శించే తీర్మానాన్ని అడ్డుకోవడంలో ఇరాన్ సహాయపడింది.”
ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ సమయంలో భారత ప్రభుత్వం తటస్థ వైఖరిని కొనసాగించింది. ఈ ప్రాంతంలో శాంతిని కోరింది. భారతదేశం ఎల్లప్పుడూ శాంతికి మద్దతుదారుగా ఉంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం అయినా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం అయినా, భారతదేశం శాంతి గురించి మాట్లాడింది. సైప్రస్‌లో ఇటీవల పర్యటించిన సందర్భంగా, ఈ శతాబ్దంలో యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదని, ప్రతి సమస్యనూ శాంతియుత మార్గాల ద్వారానే పరిష్కరించుకోవచ్చని ప్రధాన మంత్రి మోదీ పునరుద్ఘాటించారు.

More Stories
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతుపై భరోసా!
కొలీజియం సిఫార్సులు ఓ నిర్దిష్టవర్గంకే అనుకూలం
మహిళ కలెక్టర్‌కు అసభ్య సందేశాలు.. టీవీ కె ఎమ్మెల్యే అరెస్ట్