పుదుచ్చేరిలోని శ్రీ అరవిందాశ్రమం తన శతజయంతి సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శ్రీ అరవిందాశ్రమంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ మంగళవారం అభినందనలు తెలిపింది. ముఖ్యంగా ‘శ్రీమా’ (ది మదర్) దివ్య నాయకత్వంలో, ఈ ఆశ్రమం ‘సమగ్ర యోగ’ సందేశాన్ని వ్యాప్తి చేయడంలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పడంలోనూ ఎంతో కృషి చేసిందని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ఒక సందేశంలో కొనియాడారు.
భారతదేశంలోని ఆధునిక ఆధ్యాత్మిక ఉద్యమానికి ఒక సంస్థాగత కేంద్రంగా నిలిచిన ఈ ఆశ్రమం, విద్య, సాహిత్య ప్రచురణ వంటి వివిధ కార్యకలాపాల ద్వారా ‘అఖండ భారతం’ సాంస్కృతిక పునరుజ్జీవనానికి గొప్ప ప్రోత్సాహాన్ని అందించిందని ఆయన తెలిపారు. ఈ శుభ సందర్భంలో శ్రీ అరవిందులకు, శ్రీమాకు గౌరవపూర్వక నివాళులను అర్పించారు.
భారతీయ నాగరికతా వారసత్వంలో వేళ్లూనుకున్న ఈ ఆధ్యాత్మిక ఉద్యమానికి ఆశ్రమం ఒక దిక్సూచిగా నిలవాలని, అలాగే తన సాంస్కృతిక ,ఆధ్యాత్మిక లక్ష్య సాధనలో మరింత విజయం సాధించాలని ఆకాంక్షను దత్తాత్రేయ హోసబాలే వ్యక్తం చేశారు.

More Stories
యుపిలో కాంగ్రెస్కు 26 అసెంబ్లీ సీట్లు మాత్రమే!
పంజాబ్లో బీజేపీ కూటమికి అకాలీదళ్ నాయకత్వం
అరుణాచల్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత