950 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్‌..!

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం సమయానికి అమ్మకాల ఒత్తిడి మరింత పెరగడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ భారీగా పతనమయ్యాయి. దీంతో మార్కెట్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. మధ్యాహ్నం 12.20 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్‌ 950 పాయింట్లకు పైగా నష్టపోయింది.  

ముఖ్యంగా బ్యాంక్ షేర్‌లు, మెటల్‌ స్టాక్స్‌ లో అమ్మకాలు సూచీలను దెబ్బ‌తీశాయి. నిఫ్టీ 350 పాయింట్లపైగా నష్టాల్లో ట్రేడవుతున్న‌ది. వరుసగా గ‌త రెండు సెష‌న్‌ల‌లో రాణించిన‌ మార్కెట్లు ఇవాళ ఇన్వెస్ట‌ర్‌లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగడం మార్కెట్ల పతనానికి కారణ‌మైంది. కీలక సూచీలు భారీగా పడిపోవడంతో మదుపర్లలో అప్రమత్తత పెరిగింది.

న్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్ షేర్‌లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఈ నెలలో దాదాపు పది శాతం పెరిగింది. రెండు బెంచ్‌ మార్క్‌ సూచీలు జీవనకాల గరిష్ఠాలకు 2, 3 శాతం దూరంలో నిలిచాయి. 

ఈ నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం మార్కెట్లను న‌ష్ట‌ప‌ర్చింది. విదేశీ సంస్థాగత మదుపర్లు వరుసగా 15 సెషన్లలో కొనుగోళ్లకు దిగారు. ఈ నెలలో రూ.1.3 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. అధిక వెయిటేజీతో కూడిన షేర్లు కుంగడం వల్ల కూడా సూచీలపై ఒత్తిడి పడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌, ఐసీఐసీ బ్యాంక్‌ షేర్లు 2.5 శాతం మేర క్షీణించాయి.

డిసెంబర్ ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని అంచ‌నా వేస్తున్నారు. యూఎస్‌లో వడ్డీ రేట్లు పెరిగితే అమెరికా ఆస్తులు ఆకర్షణీయంగా మారి, విదేశీ పెట్టుబడులు భారత్ నుంచి తరలిపోయే ప్రమాదం ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇటీవల చోటుచేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెట్టుబడులపై లాభాలు పొందిన కొందరు మదుపర్లు వాటిని నగదుగా మార్చుకునేందుకు షేర్ల విక్రయాలకు దిగుతున్నారు. ఈ లాభాల స్వీకరణ మార్కెట్లపై ఒత్తిడిని పెంచినట్లు భావిస్తున్నారు.  .

About The Author