
దుబ్బాక లో ఓడినా సీఎం కేసీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. దుబ్బాక భయంతో జి హెచ్ ఎం సి ఎన్నికలను హడావిడిగా నిర్వహించారని, బీజేపీకి టైం కూడా ఇవ్వలేదని.. అయినా బీజేపీ కే ప్రజలు అనుకూలంగా తీర్పు ఇచ్చారని తెలిపారు.
ఎన్నికలు అయిన తర్వాత కూడా మేయర్ ను ఎందుకు ఎన్నుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఇన్ని రోజులైనా మునిసిపల్ కార్పొరేషన్ సమావేశాన్ని ఎందుకు ఎన్నికల సంఘం జరపడం లేదని నిలదీశారు.
“సిగ్గులేకుండా మా బీజేపీ కార్పొరేటర్లకు ఫోన్ లు చేసి 5 కోట్లు, 6 కోట్లు ఇస్తాం అంటున్నారు” అని సంజయ్ మండిపడ్డారు. “కేసీఆర్ నువ్వు గెలిగితే మేము గెలకాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో” అంటూ హెచ్చరించారు. “మీ కార్పొరేటర్ లు మా పార్టీ లోకి వస్తాం అంటున్నారు..అయినా మేము చేర్చుకోవడం లేదు. మేము స్టార్ట్ చేస్తే మరోలా ఉంటుంది” అని చెప్పారు.
రాష్ట్ర పోలీసులను సీఎం కేసీఆర్ జీరోలను చేస్తున్నారని ఆరోపించారు. .ప్రజల కోసం పని చేయండి…కేసీఆర్ కోసం కాదు అని పోలీసులకు హితవు చెప్పారు. శాంతిభద్రతలపై సీఎం చేతులెత్తేశారని చెబుతూ సమస్య వస్తే అధికారులే బలి అవుతారని హెచ్చరించారు.
కొత్తగూడెం జిల్లాలో ఉపాధ్యాయుడే విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే..పోలీస్ లు స్థానిక టీఆర్ఎస్ నేతలు సంఘటన ను బయటకు రాకుండా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
More Stories
కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టేయండి
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం దక్షిణ తెలంగాణకు శాపం!
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం