మొత్తం 2,345 పరిశ్రమలను లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 2,298 పరిశ్రమలను ఆన్‌లైన్ నిరంతర ఉద్గారాల పర్యవేక్షణ వ్యవస్థ (ఓసీఈఎంఎస్)కు అనుసంధానించారు. మిగిలిన 47 పరిశ్రమలను ఇప్పటికే మూసివేయడం లేదా సీజ్ చేయడం జరిగింది. పరిశ్రమల నుంచి వెలువడే పర్టిక్యులేట్ మ్యాటర్ ఉద్గారాలు ప్రతి ఘన మీటర్‌కు 50 మిల్లీగ్రాముల పరిమితిని మించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై మూసివేత, విద్యుత్ సరఫరా నిలిపివేత, సీలింగ్ వంటి చర్యలు తీసుకోనున్నారు.
హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కార్యదర్శి స్థాయి అధికారులను నియమించాలని సూచించింది. ఈ అధికారులు మూడు రాష్ట్రాల్లోని 15 నగరాల్లో కాలుష్య నియంత్రణ చర్యలను పర్యవేక్షించనున్నారు. ఇందులో హరియాణాలో ఏడు, ఉత్తరప్రదేశ్‌లో నాలుగు, రాజస్థాన్‌లో నాలుగు నగరాలు ఉన్నాయి.
వాహనాల నుంచి వెలువడే పొగను నియంత్రించడంతోపాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వాహనాల నంబర్ ప్లేట్లను ఆటోమేటిక్‌గా గుర్తించే ఏఎన్‌పీఆర్ కెమెరాలను నవంబర్ 30లోగా ఏర్పాటు చేయాలని రవాణా శాఖలను ఆదేశించింది. గడువులోగా ఈ పని పూర్తి చేయకపోతే బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.
పాత వాహనాల స్థానంలో తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే వాహనాలను ప్రవేశపెట్టడంపైనా దృష్టి సారించారు. పరివర్తన్ పథకాన్ని వేగవంతం చేసి, బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా లేని పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో బీఎస్-6, సీఎన్‌జీ, విద్యుత్ వాహనాలను 2028 నాటికి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రోడ్లపై పేరుకుపోతున్న దుమ్ము కూడా వాయు కాలుష్యానికి కారణమవుతోంది. మొత్తం 5,480 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 3,221 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను వేగవంతం చేయాలని కేంద్రం ఆదేశించింది.

More Stories
రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్ పేలుడు వెనుక పాకిస్థాన్ కుట్ర
స్నేహితులతో ప్రియుడిని కిడ్నాప్ చేసి చంపే యత్నం చేసిన కేరళ యువతి
ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం