పట్టభద్రుల ఎన్నికల్లో పట్టు సాధించాలంటే అర్హులైన ప్రతి విద్యావంతుడినీ ఓటరుగా నమోదు చేయించడమే తొలి అడుగు అని తెలిసినా ఎమ్మెల్యేలు, మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లడానికి వెనుకాడుతున్నట్టు కనిపిస్తున్న
నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్న భావన బలంగా నాటుకుపోయిందని చెప్తున్నారు. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవటం, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోడంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసహనం గూడుకట్టుకున్నదని ఆందోళన చెందుతున్నారు. అశోక్‌నగర్ మొదలు, గ్రామీణ ప్రాంతాల వరకు నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ తరుణంలో వారిని నేరుగా కలిసి ఓట్లు అడగడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు జంకుతున్నారని తెలుస్తున్నది.
ఎకడ తమను నిలదీస్తారోనన్న ఆందోళనతోనే ఓటరు నమోదు వైపు కూడా కన్నెత్తి చూడటం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి కూడా కాంగ్రెస్ నాయకులను కలవరపెడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. నూతన పీఆర్సీ ప్రకటనపై స్పష్టత లేకపోవడం, ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. న్యాయమైన సమస్యల పరిషారం కోసం ఉద్యోగ సంఘాల నేతలు ఎన్నిసార్లు విన్నవించినా ఆశించిన ఫలితం దక్కడం లేదు.
దీంతో రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ నిరసన స్వరాన్ని వినిపించాలని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు వారిని కలువడానికి కూడా సాహసించడం లేదని చెప్తున్నారు. ఈ అంతర్గత సంక్షోభం ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల స్థానంలో తీవ్రస్థాయికి చేరినట్టు ప్రచారం జరుగుతున్నది.
ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి కోసం ఖమ్మం జిల్లాకు చెందిన కీలక మంత్రులు ఈ అభ్యర్థి కోసం తాము నయాపైసా ఖర్చు చేయబోమని తేల్చి చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. నియోజకవర్గాల్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరాటాల కారణంగా మంత్రుల మధ్యే సరైన సమన్వయం లేదని అనుకుంటున్నారు. నిజానికి పోటీ చేయడానికి వ్యక్తిగతంగా పెద్దగా ఆసక్తి లేనప్పటికీ, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఒత్తిడి, మద్దతుతోనే సర్వోత్తమ్‌రెడ్డి బరిలోకి దిగాల్సి వచ్చిందనే చర్చ సాగుతున్నది.
మరోవైపు, స్థానిక మంత్రుల నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిపైనే ఆధారపడి ప్రచారాన్ని నెట్టుకొస్తున్నారని సమాచారం. ఎన్నికల్లో గెలుపు ఓటముల భారం మొత్తం మంత్రులదేనని ఎమ్మెల్యేలు స్పష్టం చేసినట్టు తెలిసింది.
అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆర్థికంగా బలపడుతున్నది వారేనని, నిర్ణయాలన్నీ మంత్రులే తీసుకుంటున్నారని, నిధుల కేటాయింపులు వారి చేతుల్లోనే ఉన్నాయని వాపోతున్నారు. పీసీసీ తరఫున నియోజకవర్గాలకు ఇన్చార్జులను నియమించినా, వారు పర్యటనలతో సరిపెడుతున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో గ్రాడ్యుయేట్లను చేరే కార్యాచరణను అమలు చేయడం లేదని పార్టీ వర్గాలే చెప్తున్నాయి.

More Stories
భారతీయ చింతనాధారకు దిక్సూచి శేషాద్రిజీ
ఈ నెలాఖరులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు?
ముప్పు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి