మరోవైపు ఈ క్రీమ్‌ను పూసిన తర్వాత మొదట చర్మాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. దీనివల్ల చర్మం ఎర్రగా మారి దురదగా అనిపిస్తుంది. ఎక్కువ కాలం వాడటం వల్ల చర్మం పలుచగా మారి రక్తనాళాలు కూడా కనిపిస్తాయి. పాదరసం, సీసం వంటి విషపూరితాలు చర్మంలోకి శోషించిన తర్వాత రక్తప్రవాహం ద్వారా మెదడు, నాడీ వ్యవస్థకు ప్రయాణిస్తాయి.
న్యూరోటాక్సిన్లుగా (నరాల విషాలుగా) పనిచేస్తూ శరీరానికి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే శరీరం ఈ విషపదార్థాలను బయటకు పంపడానికి ప్రయత్నించినప్పుడు మూత్రపిండాలు, కాలేయంలో అవి పేరుకుపోతాయి. దీంతో కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు వంటి అంతర్గత అవయవాలకు తీవ్ర నష్టం కలుగుతుందని వైద్య నిఫుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో 18 మంది మహిళలు తీవ్రమైన మూత్రపిండాల వ్యాధికి గురైనట్లు డాక్టర్లు గుర్తించారు. ఆ మహిళలంతా ఈ క్రీమ్‌ను వాడినట్లు తెలుసుకున్నారు. ఆ క్రీమ్‌లో ఆందోళనకరమైన రీతిలో సీసం, పాదరసం ఉన్నట్లు ల్యాబ్ పరీక్షలు నిర్ధారించాయి. ఈ నేపథ్యంలో పాక్ తయారీ ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను నిషేధించాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
అయినప్పటికీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని మార్కెట్లతో పాటు ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో పాక్‌కు చెందిన ఈ ఫెయిర్‌నెస్ క్రీమ్ ఇప్పటికీ అందుబాటులో ఉన్నది. మహారాష్ట్రలోని అమరావతి, నాగ్‌పూర్ మీదుగా, ఖండ్వా, బుర్హాన్పూర్ ద్వారా మధ్యప్రదేశ్‌లోకి ఈ పాక్ క్రీమ్‌లు ప్రవేశిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నట్లు గ్రహించారు.
ఈ నేపథ్యంలో వాణిజ్య నిషేధం ఉన్నప్పటికీ పాకిస్థాన్ తయారీ ఫెయిర్‌నెస్ క్రీమ్ ఉత్పత్తులు ఏ ఏ మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయంగా కూడా న్యూజిల్యాండ్, ఫిలిప్పీన్స్‌లో పాక్ క్రీమ్‌ను కొన్నేళ్ల కిందటే నిషేధించారు.

More Stories
పంజాబ్ ఎన్నికలకు ముందు హత్యలు, మాదకద్రవ్యాలు, గ్యాంగ్ హింస
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబయి
కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్’ `భారత్ వ్యతిరేక సమ్మిట్’