రష్యా- ఉక్రెయిన్ సంఘర్షణకు పరిష్కారం కోసం భారత్ సహకారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణకు శాంతియుత పరిష్కారం కనుగొనే ప్రయత్నాలకు భారతదేశం తన సహాయాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సంఘర్షణలో తాజా పరిణామాలపై జెలెన్స్కీ తన దృక్పథాన్ని పంచుకున్నారని పీఎంఓ వర్గాలు తెలిపాయి. 
 
“సంఘర్షణకు శాంతియుత పరిష్కారం కోసం సహకరించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలియజేశారు. భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చించారు,” అని అధికారిక వర్గాలు తెలిపాయి. భారతదేశపు మానవతా దృక్పథాన్ని మోదీ పునరుద్ఘాటించారు. ఈ సంఘర్షణను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్న తమ స్థిరమైన వైఖరిని పునరుద్ఘాటించారు.
 
“సంఘర్షణకు శాంతియుత పరిష్కారం లక్ష్యంగా సాగే అన్ని ప్రయత్నాలకు సహకరించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ఆయన తెలియజేశారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనం కోసం వివిధ రంగాలలో భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే చర్యలపై కూడా ఇద్దరు నాయకులు చర్చించారు,” అని పీఎంఓ అధికారులు తెలిపారు.
 
మరోవైపు, ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాల కోసం వివిధ రంగాలలో భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు పీఎంఓ పేర్కొంది. ఈ టెలిఫోన్ సంభాషణ తర్వాత ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. 
“ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడడం సంతోషంగా ఉంది. మేము మా విస్తృత ద్వైపాక్షిక సహకారం గురించి మాట్లాడాం. భారత్-ఉక్రెయిన్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాం” అని రాశారు.  ప్రస్తుత ఘర్షణలు, వాటి వల్ల ఎదురవుతున్న మానవతా సంక్షోభం గురించి, శాంతి పునరుద్ధరణ కోసం జరుగుతున్న ప్రయత్నాలపై జెలెన్‌స్కీ తన అభిప్రాయాలను చెప్పారని మోదీ తెలిపారు. ఘర్షణలకు శాంతియుత పరిష్కారం కోసం సాధ్యమైన ప్రతి విధంగానూ సహకరించడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు.

మరోవైపు రష్యాతో యుద్ధాన్ని ముగించడానికి “భారతదేశం సహకారం” ఉక్రెయిన్కు ఎంతో అవసరమని జెలెన్స్కీ చెప్పారు. శాంతి, దౌత్యం పట్ల భారతదేశ అంకితభావాన్ని ఉక్రెయిన్ అభినందిస్తుందని పేర్కొన్నారు. “యావత్ ప్రపంచం ఇప్పుడు ఈ భయంకరమైన యుద్ధాన్ని గౌరవప్రదంగా, శాశ్వత శాంతితో ముగించడానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో మేము భారతదేశ సహకారంపై ఆధారపడి ఉన్నాం” అని జెలెన్స్కీ తెలిపారు. 

About The Author