లాస్ ఏంజిల్స్ మేయ‌ర్ గా కేరళ సంతతి నిత్యారామ‌న్

అమెరికాలో రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరమైన లాస్ ఏంజిల్స్‌లో, ప్రస్తుత మేయర్ కారెన్ బాస్‌ను ఓడించి  కేర‌ళ‌లో పుట్టిన నిత్యా రామన్ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇది ఆ నగరంలో ఒక ముఖ్యమైన ఎన్నికల విజయంగా నిలిచింది.  కేర‌న్ ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌పై ఆమె గెలుపు ముంగిట నిలిచారు. దాదాపు 52 శాతం ఓట్లు ఆమెకు పోల‌య్యాయి. దీంతో లాస్ ఏంజిల్స్ న‌గ‌రానికి తొలి ఏషియ‌న్‌-అమెరిక‌న్ మేయ‌ర్‌గా నిత్యా రామ‌న్‌ రికార్డు సృష్టించారు. 
 
 తోటి డెమోక్ర‌టిక్ నేత అయిన కేర‌న్ బాస్‌తో పోటీప‌డేందుకు చివ‌రి నిమిషంలో నిత్యా రామ‌న్ నిర్ణ‌యించారు. ఆమె ఆక‌స్మిక  ప్రవేశంతో అనేక మంది నేత‌లు షాక‌య్యారు. అప్ప‌టి వ‌ర‌కు బాస్‌కు మద్దతు ఇచ్చిన ఆమె అనూహ్య రీతిలో మేయ‌ర్ పదవికి పోటీప‌డ్డారు.  బాస్ మేయ‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో లాస్ ఏంజిల్స్‌లో వైల్డ్‌ఫైర్లు, హాలీవుడ్‌లో ఉద్యోగాల కోత లాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. అయితే న‌గ‌రంలో గుంత‌ల్ని పూడ్చ‌డం, వీధి దీపాల‌ను వెలిగేలా చేస్తాన‌ని ఆమె వాగ్దానాలు చేశారు.
రామ‌న్ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో మున్సిప‌ల్ సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌నున్న‌ట్లు హామీ ఇచ్చారు. నిత్యా రామ‌న్‌కు కెన్నెత్ మేజా మద్దతు ఇవ్వ‌డంతో ఆమె పోరు ఆస‌క్తిక‌రంగా మారింది.  రామ‌న్‌, మేజా.. ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌చారం నిర్వ‌హించారు. ట్రంప్ పాల‌న ముగిసే స‌మ‌యంలో లాస్ ఏంజిల్స్ మేయ‌ర్‌గా రామ‌న్ చేయ‌నున్నారు. 2028 ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు కూడా నిత్యా రామ‌న్ చేతికి చిక్క‌నున్నాయి. నిత్యా రామ‌న్ 1981లో కేర‌ళ‌లో పుట్టారు. ఆరేళ్ల వ‌య‌సులో ఆమె అమెరికాకు వ‌ల‌స వెళ్లారు. 22 ఏళ్ల వ‌య‌సులో ఆమె అమెరికా పౌరురాలిగా మారారు. 
 
హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ నుంచి బ్యాచిల‌ర్స్ డిగ్రీ చేశారు. మ‌సాచుసెట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ నుంచి అర్బ‌న్ ప్లానింగ్‌లో ఆమె మాస్ట‌ర్స్ డిగ్రీ చేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు ట్రాన్స్‌ప‌రెంట్ చెన్నై అనే అర్బ‌న్ రీస‌ర్చ్ గ్రూపును ఆమె స్థాపించారు. 2013లో నిత్యా రామ‌న్ లాస్ ఏంజిల్స్‌కు మారారు. సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ కోసం ఆమె ప‌నిచేశారు. టైమ్స్ అప్ ఎంట‌ర్‌టైన్మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా ఆమె చేశారు.

About The Author