అమెరికా ఎన్నికల షాక్.. దలాల్ స్ట్రీట్‌కు రూ. 7 లక్షల కోట్ల దీపావళి కానుక

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీ రిపబ్లికన్లు చిత్తుగా ఓటమిపాలవ్వడం, డెమోక్రాట్లు కాంగ్రెస్ లోని ఇరుసభలపై పట్టు సంపాదించడంతో  గురువారం ఉదయం దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులకు ఊహించని లాభం చేకూరింది. ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల, విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు పునరుద్ధరించబడటం, వాల్ స్ట్రీట్‌లో ర్యాలీ కలసి భారతీయ ఈక్విటీలను పైకి లేపాయి.  మరోవైపు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ కూడా బలపడింది. ఇవాళ్టి ట్రేడింగ్ లో 14 పైసలు పెరిగి ప్రస్తుతం 94.32 వద్ద కొనసాగుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
మార్కెట్ ప్రారంభమైన రెండు గంటల్లోనే పెట్టుబడిదారుల సంపదకు రూ. 7 లక్షల కోట్లకు పైగా చేరాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,300 పాయింట్లకు పైగా పెరిగి 78,630 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 50 24,350 మార్కును దాటింది. ఈ ర్యాలీతో భారతదేశం వరుసగా ఆరు ట్రేడింగ్ సెషన్లలో లాభాల పరంపరను కొనసాగించింది. ఉదయం 11:45 గంటల సమయానికి, సెన్సెక్స్ 1,550 పాయింట్లు ఎగబాకి 78,860.79కి చేరుకుంది. నిఫ్టీ 50 455 పాయింట్లు పెరిగి 24,415.55కి చేరింది. 
 
మరీ ముఖ్యంగా, నిఫ్టీ50 సెప్టెంబర్ 4, 2026 తర్వాత తొలిసారిగా 24,000 మార్కును దాటింది. గురువారం మార్కెట్ ప్రారంభమయ్యే నాటికి, అన్ని బీఎస్ఈ సెన్సెక్స్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 4,93,44,359 కోట్లుగా ఉంది. ఉదయం 11:45 గంటల సమయానికి, మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 5,01,13,800 కోట్లకు ఎగబాకింది — ఇది రూ. 7 లక్షల కోట్లకు పైగా పెరుగుదల.

 

 30 షేర్ల బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఇవాళ 2.08 శాతం పెరుగుద‌ల క‌నిపించింది. మొత్తం 1609.54 పాయింట్లు దూసుకెళ్లింది. ఇక నిఫ్టీ50 417.45 పాయింట్ల లాభాల్లో ట్రేడ్ అయ్యింది. నిఫ్టీ షేర్లు 1.74 శాతం వృద్ధి సాధించాయి.  గత సెషన్‌లో బ్రెంట్ క్రూడ్ 8.7% పడిపోయి, బ్యారెల్‌కు $94 వైపు జారుకోగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ సుమారు $88కి పడిపోయింది. వాషింగ్టన్‌లోని కొత్త రాజకీయ సమతుల్యత, అమెరికా-ఇరాన్ సంఘర్షణను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతుందని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. 

 
విదేశీ పెట్టుబడిదారులు బుధవారం రూ. 7,284 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇది అక్టోబర్ 28, 2025 తర్వాత వారి అత్యధిక ఒక్కరోజు కొనుగోలు. ఇది వారి వరుసగా నాలుగో నికర కొనుగోలు సెషన్. సెప్టెంబర్, అక్టోబర్‌లో దాదాపు రూ. 90,000 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించిన తర్వాత, నవంబర్‌లో ఇప్పటివరకు ఎఫ్‌ఐఐలు రూ. 17,000 కోట్లకు పైగా విలువైన భారతీయ ఈక్విటీలను కొనుగోలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, .. ముడి చమురు ధరలు 8 శాతానికి పైగా పడిపోవడం దేశీయ మార్కెట్లకు సానుకూలంగా మారాయి.
 
 

 

About The Author