భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మరోసారి తన సత్తా చాటింది. హైలో ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ వరుస గేమ్స్‌లో విజయం సాధించి పతకంను తన ఖాతాలో వేసుకున్నాడు. సింధు హైలో ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించగా, లక్ష్య సేన్ రెండోసారి ఈ ట్రోఫీని అందుకుని ఈ ఏడాది తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు.
ఆదివారం రోజు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో డెన్మార్క్ షట్లర్ ప్రపంచ 25వ ర్యాంక్ ప్లేయర్ లైన్ హోజ్‌మార్క్ కేజర్స్‌ఫెల్ట్‌ను సింధు వరుస గేముల్లో ఓడించింది. సింధు డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ కేజర్స్‌ఫెల్డ్‌ను 21-12, 21-14తో ఓడించగా, లక్ష్య సేన్ ఇండోనేషియా స్టార్, డిఫెండింగ్ చాంపియన్ జొనాటన్ క్రిస్టీపై 21-17, 21-10తో విజయం సాధించాడు.
కేవలం 39 నిమిషాల్లోనే ఫైనల్ మ్యాచ్‌ను సింధు ముగించింది. ప్రపంచ మాజీ ఛాంపియన్ అయిన సింధుకు ఈ సీజన్‌లో ఇది రెండో టైటిల్ కావడం విశేషం. ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉంది. అంతకుముందు జులైలో జపాన్ ఓపెన్‌ను గెల్చుకున్న సింధు ఇప్పుడు హైలో ఓపెన్ విజేతగా నిలిచి మరోసారి తన ఫామ్‌ను నిరూపించుకుంది.
అంతకుముందు గత వారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా కూడా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ ముందు వరకు కూడా డెన్మార్క్ క్రీడాకారిణిపై సింధుకు ఘనమైన రికార్డే ఉంది. ఇరువురు 7 సార్లు పోటాపోటీ తలపడగా సింధు 6 సార్లు గెలవగా, లైన్ హోజ్‌మార్క్ ఒకసారి మాత్రమే గెలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ తనదైన దూకుడుతో అదరగొట్టాడు.
డిఫెండింగ్ చాంపియన్ జొనాటన్ క్రిస్టీతో తలపడిన లక్ష్య తొలి గేమ్‌లో గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికీ, కీలక పాయింట్ల వద్ద ఒత్తిడిని తట్టుకుని 21-17తో గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో మాత్రం లక్ష్య పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. క్రిస్టీ స్మాష్‌లను సమర్థంగా ఎదుర్కొంటూ, తన రిటర్న్‌లతో ప్రత్యర్థిని తప్పిదాలకు గురిచేశాడు. వరుస పాయింట్లతో ఆధిక్యాన్ని పెంచుకుంటూ 21-10తో గేమ్‌ను ముగించాడు. దీంతో రెండోసారి హైలో ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
హైలో ఓపెన్‌లో సింధు, లక్ష్య సేన్ టైటిళ్లు గెలవడం భారత బ్యాడ్మింటన్‌కు మంచి ఊపునిచ్చింది. వరుస టోర్నీల్లో సింధు నిలకడగా రాణిస్తుండగా, లక్ష్య కూడా ఈ ఏడాది తొలి టైటిల్‌తో తిరిగి విజయాల బాట పట్టాడు. సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన ఇద్దరికీ 35 వేల అమెరికన్ డాలర్లకు పైగా ప్రైజ్‌మనీ లభించనుంది.
“ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ఎవరనే దానితో సంబంధం లేకుండా నా వంతుగా 100 శాతం ఆటను ఇవ్వడం నాకు ముఖ్యం. మేం గతంలో చాలా సార్లు తలబడ్డాం. అందుకే ప్రతీ పాయింట్‌పై దృష్టి పెట్టాను. మ్యాచ్ మొత్తం కాదు, నాకు ప్రతి పాయింట్ కూడా ముఖ్యమే. మ్యాచ్ ప్రారంభం నుంచే నేను ప్రత్యర్థిపై ఆధిక్యం సాధించాను. ఆమెకు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు” అని విజయం అనంతరం సింధు తెలిపారు.
ఈ విజయం తనకెంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని, ఆత్మవిశ్వాసాన్ని పెంచిం. గడిచిందని పేర్కొంటూ రెండు వారాలు నిజంగా అద్భుతంగా సాగాయని ఆమె చెప్పారు. ఈ విజయంతో పీవీ సింధుకు 9200 ర్యాంకింగ్ పాయింట్స్ లభించాయి. సీజన్ చివర్లో జరిగే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు భారత స్టార్ షట్లర్ అర్హత సాధించే అవకాశాల్ని ఈ విజయం మరింత మెరుగుపరిచింది.

More Stories
ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది మృతి
రాప్తాడు బాలికపై దాడి చేసిన ఉన్మాదిపై పోలీసుల కాల్పులు
రామ్‌లీలా మైదానంలో 10 లక్షల మంది ఎక్కడ రాహుల్!.. బీజేపీ