డార్క్ వెబ్‌లో 3897 మంది ఎస్బీఐ కస్టమర్ల వ్యక్తిగత వివరాలు

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ సైబర్ దాడి జరిగింది. బ్యాంక్ ఖాాతాదారుల సమాచారం ఇంటర్నెట్‌లోని డార్క్ వెబ్‌లో లీక్ అయింది. ఈ మేరకు దీనిపై బ్యాంక్ అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది. డేటా లీక్ వార్తలపై బ్యాంక్ కూడా స్టాక్ ఎక్స్చేంజీలకు ఒక ఫైలింగ్‌లో అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 
 
డార్క్‌వెబ్‌లో సుమారు 3.75 లక్షల కస్టమర్ల రికార్డులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించగా, ఇందులో 3897 మంది ఖాతాదారుల పూర్తి వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు బ్యాంక్ తెలిపింది. లీక్ అయిన డేటాలో కస్టమర్ల పేర్లు, జెండర్, పుట్టిన తేదీలు, జెండర్, ఇ- మెయిల్ ఐడీలు, చిరునాామాలు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు, బ్యాంక్ బ్రాంచ్ వివరాలు, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ (సిఐఎఫ్) ఐడీలు, లోన్ అప్లికేషన్లకు సంబంధించిన కొన్ని ఫైళ్లు ఉన్నట్లు బ్యాంక్ అనుమానిస్తోంది.

ఈ డాటా లీకేజీ గురించి థ్రెట్ ఇంటెలిజెన్స్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్, సెర్ట్-ఇన్ సమాచారం అందించిన‌ట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ డాటా లీకేజీ సమాచారంతో ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రొసీజ‌ర్‌ను సంస్థ యాక్టివేట్ చేసింది. దీనిపై విచార‌ణ కూడా జ‌రుగుతోంది. అయితే, ఈ సైబ‌ర్ దాడి వ‌ల్ల బ్యాంక్ ఆర్థిక లావాదేవీల‌పై, వ్యాపార నిర్వ‌హ‌ణ‌, ఆర్థిక అంశాల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని ఎస్బీఐ వివ‌రించింది.

అలాగే, డాటా లీక్ అయిన క‌స్ట‌మ‌ర్ల ట్రాన్సాక్ష‌న్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని హామీ ఇచ్చింది. ఇక‌, ఎలాంటి డాటా లీక్ అయింద‌న్న‌ది నిర్ధ‌రించ‌డానికి పూర్తిస్థాయి స‌మ‌గ్ర విచార‌ణ అవ‌స‌ర‌మ‌ని ఎస్బీఐ తెలిపింది. ఈ డాటా లీక్ అయినంత మాత్రాన ప్ర‌తి ఖాతా హ్యాక్ అయిన‌ట్లు కాద‌ని సంస్థ వెల్ల‌డించింది. అందువ‌ల్ల ఖాతాదారులు ఆందోళ‌న చెంద‌వ‌ల‌సిన అవ‌స‌రం లేద‌ని సంస్థ వివ‌రించింది. 

ప్ర‌స్తుతం లీక్ అయిన డాటా ప్ర‌కారం హ్యాక‌ర్లు  ఆ డాటా ఆధారంగా క‌స్ట‌మ‌ర్ల‌కు బ్యాంకు సిబ్బంది లాగా కాల్ చేసి, వేధించ‌డం చేయ‌వ‌చ్చు. ఎందుకంటే కస్ట‌మ‌ర్ల‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం వారి వద్ద ఉంటుంది కాబ‌ట్టి. ఇక‌, యూజ‌ర్లు ఇలాంటి డేటా లీక్ కాకుండా ఉండాలంటే ఎప్ప‌టిక‌ప్పుడు అల‌ర్ట్‌గా ఉండాలి. ఓటీపీ, పిన్, పాస్‌వ‌ర్డ్‌లు ఎవ‌రితో షేర్ చేసుకోకూడ‌దు. ట్రాన్సాక్ష‌న్స్‌కు సంబంధించిన అల‌ర్ట్స్ ఎనేబుల్ చేసుకోవాలి. 

దీనివ‌ల్ల ప్ర‌తి లావాదేవీకి సంబంధించిన స‌మాచారం అందుతుంది. ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్స్ చేయాలంటే ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్ర‌మే వాడాలి. తెలియని వారు బ్యాంకు పేరుతో పంపే వాటిని క్లిక్ చేయొద్దు. లోన్ అకౌంట్లు, క్రెడిట్ కార్డు ఎంక్వైరీల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి. బ‌యోమెట్రిక్ లాక్ చేసుకోవాలి. అనుమానిత కాల్స్, మెసేజ్‌ల‌పై ఫిర్యాదు చేయాలి.

About The Author