ఈ డాటా లీకేజీ గురించి థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, సెర్ట్-ఇన్ సమాచారం అందించినట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ డాటా లీకేజీ సమాచారంతో ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రొసీజర్‌ను సంస్థ యాక్టివేట్ చేసింది. దీనిపై విచారణ కూడా జరుగుతోంది. అయితే, ఈ సైబర్ దాడి వల్ల బ్యాంక్ ఆర్థిక లావాదేవీలపై, వ్యాపార నిర్వహణ, ఆర్థిక అంశాలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఎస్బీఐ వివరించింది.
అలాగే, డాటా లీక్ అయిన కస్టమర్ల ట్రాన్సాక్షన్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించుకోవచ్చని హామీ ఇచ్చింది. ఇక, ఎలాంటి డాటా లీక్ అయిందన్నది నిర్ధరించడానికి పూర్తిస్థాయి సమగ్ర విచారణ అవసరమని ఎస్బీఐ తెలిపింది. ఈ డాటా లీక్ అయినంత మాత్రాన ప్రతి ఖాతా హ్యాక్ అయినట్లు కాదని సంస్థ వెల్లడించింది. అందువల్ల ఖాతాదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని సంస్థ వివరించింది.
ప్రస్తుతం లీక్ అయిన డాటా ప్రకారం హ్యాకర్లు ఆ డాటా ఆధారంగా కస్టమర్లకు బ్యాంకు సిబ్బంది లాగా కాల్ చేసి, వేధించడం చేయవచ్చు. ఎందుకంటే కస్టమర్లకు సంబంధించిన పూర్తి సమాచారం వారి వద్ద ఉంటుంది కాబట్టి. ఇక, యూజర్లు ఇలాంటి డేటా లీక్ కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండాలి. ఓటీపీ, పిన్, పాస్వర్డ్లు ఎవరితో షేర్ చేసుకోకూడదు. ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన అలర్ట్స్ ఎనేబుల్ చేసుకోవాలి.
దీనివల్ల ప్రతి లావాదేవీకి సంబంధించిన సమాచారం అందుతుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వాడాలి. తెలియని వారు బ్యాంకు పేరుతో పంపే వాటిని క్లిక్ చేయొద్దు. లోన్ అకౌంట్లు, క్రెడిట్ కార్డు ఎంక్వైరీలపై అప్రమత్తంగా ఉండాలి. బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలి. అనుమానిత కాల్స్, మెసేజ్‌లపై ఫిర్యాదు చేయాలి.

More Stories
విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు
భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేటి నుంచే అమలు