బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ చేశారు. ఛాతి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్ను ఆయన్ను అక్టోబర్ 16వ తేదీన ఆస్పత్రిలో చేర్పించారు. అక్టోబర్ 19వ తేదీన ఆస్పత్రి చేసిన ప్రకటన ఆధారంగా న్యూరాలజీ డాక్టర్ వినీత్ సూరీ పర్యవేక్షణలో అద్వానీ చికిత్స పొందారు.
అద్వానీ, సీనియర్ కన్సల్టెంట్ (న్యూరాలజీ) డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఆసుపత్రి సోమవారం తెలిపింది. 98 ఏళ్ల అద్వానీని శుక్రవారం రాత్రి 7.30 నిమిషాలకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పల్మోనరీ శాఖలో ఆయన్ను అడ్మిట్ చేశారు. డాక్టర్ల బృందం ఆయన్ను అబ్జర్వేషన్లో పెట్టారు. వైద్య పరీక్షలు చేశారు.
“ఛాతీ ఇన్ఫెక్షన్తో అక్టోబర్ 16న అపోలో ఆసుపత్రిలో చేరిన శ్రీ ఎల్.కె. అద్వానీ ఈరోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతున్నారు. ఆయన సీనియర్ కన్సల్టెంట్ (న్యూరాలజీ) డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది” అని ఆసుపత్రి ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అపోలో ఆసుపత్రిలో అద్వానీని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల కాలంలో అద్వానీ తరుచూ ఆస్పత్రిలో చేరుతున్నారు. వయసు రీత్యా ఆరోగ్య సమస్యలతో ఈ ఏడాది మే నెలలో అపోలో ఆస్పత్రిలో చేరారు. డిశ్చార్జ్ కావడానికి ముందు ఆయన కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారు.

More Stories
టైగర్ ష్రాఫ్పై కాల్పుల కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
జింబాబ్వేపై భారత్ మహిళా జట్టు ఘన విజయం- సిరీస్ కైవసం
ఇస్లాం అనుసరించాలని, ఖురాన్ చదవాలని కోరిన సింబయాసిస్ ప్రొఫెసర్